నాసా : ఆ బైక్.. అక్కడే నడుస్తుందట.. !

సాంకేతికతను పెట్టింది పేరు అంటూ ముందుకు పోతున్న అమెరికా, అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో కొత్త పరికరాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలో ఎన్నో విషయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న నాసా తాజాగా చంద్రయాన్ లో భాగంగా అక్కడ వ్యోమగాములు ఒక చోటి నుండి మరోచోటుకు వెళ్ళడానికి సులభంగా ఉండేందుకు ఒక బైక్ ను కనిపెట్టింది. దీనితో వాళ్ళు చంద్రునిపై ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్లేవిధంగా రూపొందించింది. ఆర్టిమెస్ ద్వారా నాసా 2024 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేయనున్న విషయం తెలిసిందే.
అందుకు అనుగుణంగా ఈ కొత్త బైక్ రూపొందించింది. దీని ద్వారా యాత్రికులు చంద్రుడిపై సంచరించి రావచ్చు. ఈ నేపథ్యంలోనే  నాసా పలు రోవర్లను, మోటార్ బైక్ ల ఉత్పత్తి భారీగా చేపడుతుంది. అలాగే చంద్రుడిపై యాత్రికులు ఒక చోటు నుండి మరో ప్రదేశానికి వెళ్ళడానికి కుదిరే అంశాలను పరిశోదిస్తూ ఆయా వాహనాల ఉత్పత్తికి సిద్ధం అవుతుంది. క్రితం ఏడాది రష్యా తయారు చేసిన వాహనాల మాదిరిగా కాకుండా నాసా చూడటానికి కూడా బైక్ మాదిరే ఉండే వాహనాలను తయారు చేసింది. చంద్ర రోవర్ పేరుతోనే హుకికో బైక్ రోవర్ నిర్మించింది నాసా. మాస్కో శాస్త్రవేత్తలు ఈ రోవర్ ను రూపొందించారు. దీనిని అతిత్వరలో లాస్ ఏంజిల్స్ లోని పీటర్ సన్ మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు.
దీనిని ఆటో డెస్క్ ఫ్యూజన్ 360 సాయంతో హుకికో వ్యవస్థాపకుడు నికో ముల్లర్ రూపొందించారు. దీనిపేరు టార్డి గ్రేడ్ గా పిలుస్తున్నారు. థర్మోప్లాస్టిక్ పాలియురేతెన్ తో టైర్లను తయారుచేశారు. దీన్ని అల్యూమినియం ట్రెసెస్ తో తయారుచేశారు. చంద్రుడినిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి తట్టుకునేట్టుగా ఈ బైక్ రూపొందించారు. నాసా తొలి మానవసహిత యాత్రను 1959 లో నే విజయవంతంగా అపోలో 11 వ్యోమనౌక ద్వారా ప్రయోగించిన విషయం తెలిసిందే. మరోసారి ఇదే తరహా ప్రయోగానికి నాసా సిద్ధం అవుతుంది. దానికోసమే ఈ బైక్ తయారీ ప్రారంభించింది. అయితే ఎలెన్ మస్క్ మాదిరే యాత్రికుల ను తరలించే పని నాసా పెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి. అందుకే ఈ తరహా బైక్ రూపొందిస్తుంది అనేది ఇప్పటి పరిస్థితిని బట్టి అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: