రెడ్‌మి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్... కేవలం రూ. 6999లకే...!
రెడ్‌మి 9ఐ స్పోర్ట్ ప్రారంభ ధర రూ.8,799, దీనిలో వినియోగదారులు 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అయితే 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 9299 కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ Mi.Dom లో లిస్ట్ చేశారు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మెటాలిక్ పర్పుల్, కోరల్ గ్రీన్ కలర్‌లో వస్తుంది.
అదే సమయంలో మీరు రెడ్‌మి 9 ఎ స్పోర్ట్‌ని రూ. 6,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇతర వేరియంట్ ధర రూ .7999. ఈ వేరియంట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ Redmi's Mi.Com లో కూడా లిస్ట్ చేశారు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మెటాలిక్ పర్పుల్, కోరల్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. రెండు స్పోర్ట్స్ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
రెడ్‌మి 9ఎ స్పోర్ట్ స్పెసిఫికేషన్స్
రెడ్‌మి 9ఎ స్పోర్ట్ 6.53 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ శైలిలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జి 25 ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే ఇందులో గరిష్టంగా 3 జీబీ ర్యామ్ ఉంది. ఈ ఫోన్ MIUI 12 ఆధారిత Android 10 పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఛార్జింగ్ కోసం మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి.
కెమెరా విభాగం గురించి మాట్లాడుతూ వెనుక ప్యానెల్‌లో ఒకే కెమెరా ఉంది. ఇది 13 మెగా పిక్సెల్స్. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది.
రెడ్‌మి 9 ఐ స్పోర్ట్ స్పెసిఫికేషన్‌లు
రెడ్‌మి 9 ఐ స్పోర్ట్ 6.53 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో మీడియా టెక్ హీలియో జి 25 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం కంపెనీ బ్యాక్ ప్యానెల్‌లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000 mAh బ్యాటరీ అందించబడింది.