బుల్లి పిట్ట: ఇండియాలోనే అత్యంత ఖరీదైన సోనీ టీవీ..ఫీచర్స్ అదుర్స్..!

Divya
సాధారణంగా స్మార్ట్ మొబైల్స్ తో పోల్చుకుంటే ఇటీవల గత మూడు సంవత్సరాలుగా స్మార్ట్ టీవీ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతుందని చెప్పాలి.. మొబైల్ తయారీ సంస్థలైన రియల్ మీ , వన్ ప్లస్ , షియోమీ వంటి కంపెనీలు కూడా భారతదేశంలోకి స్మార్ట్ టీవీ లను విడుదల చేసి , టీవీ మార్కెట్లో కూడా గట్టిగా పట్టును సాధించాయి. కానీ మొదటి నుంచి వస్తున్న టెలికాం దిగ్గజం సంస్థలైన సోనీ , సామ్సంగ్ వంటి కంపెనీలు మాత్రం ఇప్పటికీ తమ పరిధిని దాట లేదనే చెప్పాలి..
కానీ మొదటిసారి సోనీ కంపెనీ కూడా ఒక కొత్త టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అదేమిటంటే సోనీ బ్రావియా ఎక్స్ ఆర్ మాస్టర్ సిరీస్ 85 జెడ్ 9జే 8 కె ఎల్ఈడి స్మార్ట్ టీవీ ని సోనీ భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది..ఇక ప్రస్తుతం దీని ధర తెలిస్తే మాత్రం గుండె ఆగి పోవాల్సిందే.. కనీ వినీ ఎరుగని రీతిలో భారతదేశంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ టీవీ గా ఈ టీవీ గుర్తింపు పొందింది. ఇక దీని ధర ఎంత అంటే , రూ.12,99,990 .
ఇక ఈ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికొస్తే,  స్క్రీన్ రిజల్యూషన్ 7680x4320 పిక్సెల్స్ తో అందుబాటులో ఉంది.. ఈ టీవీ లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే స్మార్ట్ మొబైల్స్ లో ముఖ్యంగా ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్ ఇచ్చారు. ఇక దీనితో పాటు ఈటీవీలో సోనీ ఎక్స్ ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ కూడా మనకు లభిస్తుంది. అంతేకాదు సోనీ బ్రావియా ఎక్స్ ఆర్ మాస్టర్ 85 జెడ్ 9 జే 8 కే  టీవీలను ప్రస్తుతం భారత మార్కెట్లో కూడా విక్రయానికి ఉంచారు.. వీటిని కేవలం ఆన్లైన్ స్టోర్ ద్వారానే కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించారు. ఇక ఇందులో గూగుల్ టీవీ ఇంటర్ఫేస్, 10 స్పీకర్లు, సౌండ్ ఉత్పత్తి 85 w, రెండు మిడ్ రేంజ్ డ్రైవర్ ల తో పాటు నాలుగు ట్వీటర్లు , నాలుగు సబ్ ఊఫర్ లు కూడా అమర్చబడి ఉన్నాయి. అంతేకాదు 16జిబి స్టోరేజ్ తో ఇది మనకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: