బుల్లిపిట్ట: ఇకపై విద్యుత్ పొందాలంటే ..రీఛార్జ్ తప్పనిసరి అంటున్న సర్కార్..!

Divya
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్తగా మరొకసారి విద్యుత్ మీటర్ల విషయంపై , మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇక ప్రతి ఇంటికి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను సమకూర్చేందుకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉన్నదని తెలుపుతోంది. మన మొబైల్ లో వున్న సిమ్ కు ఎలా రీఛార్జ్ చేసుకుంటామో, విద్యుత్ కోసం కూడా ముందుగానే కొంత డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేసుకొనే సదుపాయాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు తెలియజేస్తోంది.

ఇకమీదట కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాలయాలలో కూడా ఇక మీదట విద్యుత్ కనెక్షన్లు ప్రీపెయిడ్ మీటర్లు ను బిగించనున్నారట. ఇక మీదట మొబైల్లో డిటిహెచ్ రీఛార్జ్ మాదిరిగానే ఈ ఆప్షన్ ను రూపొందించబోతున్న ట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇక అలాగే బ్యాలెన్స్ ఎంత ఉన్నదో ముందుగానే తెలుసుకొని రీఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కలిగించనుంది.

ఒకవేళ అలా చేసుకోకుంటే విద్యుత్ సదుపాయం అంతరాయం కలుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ విద్యుత్ మీటర్లు అధిక భారంగా భావిస్తున్న సర్కార్ ప్రభుత్వం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనున్నట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు సమాచారం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 60 శాతం వరకు ఇవ్వాలని కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇక కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్తు రంగంలో పలు మార్పులను చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.
దీంతో దొంగగా వాడేటటువంటి విద్యుత్ సరఫరాలను గుర్తించవచ్చు అనే విధంగా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఎటువంటి ప్రయోగాన్ని హైదరాబాదులోని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపుగా 28,800 స్మార్ట్ మీటర్లను బిగించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా తో దేశం ఆర్థిక నష్టం తో ఉండడంతో.. పారిశ్రామిక వాణిజ్య రంగాలకు మాత్రం 2023 డిసెంబర్ నాటికి ఈ మీటర్లను బిగించే విధంగా సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.2025 మార్చి నాటికి వ్యవసాయరంగానికి తప్ప మిగతా అన్నిటికీ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: