నడిస్తే .. విద్యుత్ .. ఇదేదో బాగుందే..

ప్రపంచంలో పెరిగిపోతున్న జనాభా వలన విద్యుత్ వినియోగం కూడా తీవ్రంగానే పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరు వీలైనంత సౌకర్యంగానే జీవించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఇంటిలోని వస్తువులు విద్యుత్ తో పనిచేసేవే అవడం తో వినియోగం కూడా భారీగా పెరిగిపోతుంది. అందుకే రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే రకరకాల పద్దతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే ఉన్నారు. బొగ్గు ద్వారా, నీటి ద్వారా, తాజాగా సోలార్ వంటివి ఈ కోవలో ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఉత్పత్తి పెంచినా,అంతే స్థాయిలో వినియోగం కూడా పెరిగిపోతుంది. సీజన్ వారీగా కూడా ఈ వినియోగం ఉంటుంది. ఇక వినియోగదారులలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కరెంటు రవాణా వ్యవస్థ, రోడ్ల పై విద్యుత్ దీపాలు తదితరం ఉన్నాయి.
అయితే బొగ్గు గనులు కూడా ఒకనాటికి అంతరించిపోతాయి కాబట్టి ఈ దారి మూసుకొనే లోపే జల విద్యుత్ తెరపైకి వచ్చేసింది. ప్రస్తుతం కాలుష్య రహిత ప్రపంచం కోసం తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. అందుకోసం సోలార్ వినియోగం తెరపైకి వచ్చింది. ఇన్ని ఉత్పాదక మార్గాలు ఉన్నప్పటికీ వినియోగదారుల అవసరాల మేరకు లేదా భవిష్యత్తులో పెరిగే అవసరాలను అలాగే ఆయా వనరులను బట్టి ఉత్పత్తిని తీవ్రంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణుల అంచనా. అందుకే ఇంకా ఎలా విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చు అనే దానిపై శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. చాలా పద్ధతులు తెరపైకి రాకుండానే మరుగైపోవడానికి కూడా వనరులు అంతరించిపోయే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
అంటే ప్రయోగాలు ఎలా ఉండాలి..ఉత్పత్తి జరగాలి కానీ అది జీవన విధానంలో భాగమై ఉండాలి, ఇలాగైతే జీవనం ఉన్నత వరకు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఇంతవరకు ఉంటె చాలదు, ఎంత వరకు ఉత్పత్తి సామర్థ్యం ఉంది, వినియోగం ఎంత, భవిష్యత్ అవసరాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదే స్విస్ లో జరుగుతుంది. దానిపేరు పవర్ వాక్ అని పెట్టారు. అంటే మనం నడుస్తున్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి అవుతూనే ఉంటుందన్నమాట. ఇది అన్ని అవసరాలకు సరిపోతుందా అంటే, వేచి చూడాల్సిందే. ఇంకా ఇది ప్రయోగ స్థితిలోనే ఉంది. విద్యుత్ అంటే ప్రమాదకరమైంది, మనిషి అవసరాలకు సరిపడా అంటే అది కాళ్ళకిందే అంటే ఆ మాత్రం జాగర్తలు తీసుకోవాలి కదా. అందుకే ఇంకా ప్రయోగ స్థితిలో ఉన్నా కూడా ఇది విజయవంతం అయితే, చాలా ఉపయోగంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: