ఫోన్ పోతే ఈ ఆప్ష‌న్ తో క‌నిపెట్టొచ్చు..డేటా ఎరేజ్ చెయొచ్చు తెలుసా..?

Paloji Vinay
ప్ర‌స్తుతం ఉన్న జ‌న‌రేష‌న్‌లో మొబైల్ ఫోన్ త‌ప్ప‌నిస‌రి.. నిజం చెప్పాలంటే మొబైల్ ఫోన్ మ‌న జీవితాల్లో నిత్యావ‌స‌ర వ‌స్తువుగా మారిపోయింది. ప‌డుకున్నా, లేచినా, తిన్నా ఎక్క‌డికి వెళ్లినా ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మ‌న ఉండాలి. అలాంటిది ఒక నిమిషం క‌న‌బ‌డ‌క‌పోతే ఆగినంత ప‌ని అవుతుంది. ఎక్క‌డ పెట్టామా అని తెగ ఆందోళ‌న చెందుతాం. అదే నిజంగా ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళన మ‌రింత తీవ్రంగా మారుతుంది. ఎందుకంటే ఫోటోలో నుంచి అతిముఖ్య‌మైన ఫైల్స్‌, పేమెంట్ యాప్స్ అన్ని అందులోనే నిక్షిప్తం అయి ఉంటాయి. ప‌ర్స‌న‌ల్ ఫోటోస్ కూడా అందులోనే ఉంటాయి. ఎక్క‌డికైనా వెళ్లిన‌ప్పుడు మ‌న వెంట ఏం లేక‌పోయినా పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు అదే ఫోన్ లేక‌పోతే ఇక ఆ అవ‌స్థ‌లు చెప్ప‌లేము. ఒక‌వేళ మొబైల్‌ఫోన్ పోతే దాన్ని ఎలా క‌నిపెట్టాలి లేదా డేటా ఎలా ఎరేజ్ చేయాల‌నే విష‌యం గురించి తెలుసుకుందాం.

  ముందుగా మరోక ఫోన్ లేదా ఇతర డివైజ్‌ను తీసుకోవాలి. android.com/find లో గూగుల్‌ అకౌంట్‌తో (పోయిన ఫోన్‌లోని గూగుల్‌ అకౌంట్‌తోనే) లాగిన్‌ అవ్వాలి. అప్పుడు ఆ రెండు ఫోన్లు ఒకే అకౌంట్‌కు లింక్ అయ్యుంటాయి. కాబట్టి ఫోన్‌ ఎక్కడుందనే ఆప్షన్‌ను ట్రేస్‌ చేసి లొకేషన్‌ను(సరైన లొకేషన్‌/లేదంటే ఆ దగ్గరి ప్రాంతంలో) గుర్తించడం సుల‌భంగా మారుతుంది. అయితే ఫోన్‌ ఉన్న ప్రాంతం చూపించినప్పుడు ఒంట‌రిగా వెళ్లకపోవడం మంచిది.
 
- గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ ఫీచర్‌లో ‘ప్లే సౌండ్‌’ అనే ఆప్షన్ ఒక‌టి క‌నిపిస్తుంది.  ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు, లేదంటే ఫోన్‌ దొంగతనం అయిన‌ప్పుడు దగ్గర్లోనే ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ ఫీచర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోన్‌ కనిపెట్టిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే.. ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్నా సరే ఐదు నిమిషాలపాటు ఏకధాటిన శ‌బ్ధం వ‌స్తునే ఉంటుంది. అప్పుడు మొబైల్ ఎక్క‌డుందో క‌నిపెట్ట‌వ‌చ్చు.
 
- మొబైల్ ఫోన్‌ దొంగతనం కావాల‌నే ఏం ఉండ‌దు, కొన్ని సంద‌ర్భాల్లో ఎక్కడో పెట్టి మరిచిపోవచ్చు మ‌నం. ఆ స‌మ‌యంలో ఫోన్‌ రిటర్న్‌ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ల కోసం ‘సెక్యూర్‌ డివైజ్‌’ ఆప్షన్ ఉంది. దానిని క్లిక్‌ చేస్తే.. పోయిన ఫోన్‌ స్క్రీన్‌పై అవతలి వాళ్లకు ఓ మెసేజ్‌ పంపడానికి అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు ప్రత్యామ్నాయ నెంబర్‌ను కూడా వాళ్లకు చేర‌వేయొచ్చు. అయితే ఈ ఆప్షన్ తో ఫోన్‌లోని డేటాను రక్షించడం కోసం ఫోన్‌ను లాక్‌ చేస్తుంది.
 
- ఒకవేళ ఫోన్‌ను కనుక్కోవడం కష్టతరంగా మారిన స‌మ‌యంలో ఆ మొబైల్ ఫోన్‌లో ఉన్న మొత్తం డేటాను ఎరేజ్ చేయొచ్చు. దాని కోసం అదే పేజీలో ఉండే..`ఎరేజ్ డివైజ్‌` బ‌ట‌న్‌ను క్లిక్ చేసిన త‌రువాత క‌న్ఫ‌ర్మ్ చేయాలి. అప్పుడు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లో ఉన్న డాటా మొత్తం డిలిట్ అవుతుంది. కానీ, ఎక్స్‌ట‌ర్న‌ల్‌గా ఉండే డాటా మాత్రం అలాగే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: