స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ తప్పక ఉంటుంది. అయితే, ఈ యాప్ పాపులర్ మెసేజింగ్ యాప్‌గా పేరు గాంచినప్పటికీ కస్టమర్స్ కోసం నూతన ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంది. మార్కెట్‌లో నెంబర్ వన్‌గా నిలిచేందుకుగాను ఈ ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు ఈ నూతన అప్‌డేట్స్ తీసుకొస్తున్నది సంస్థ. తాజాగా కస్టమర్స్ కోసం న్యూ కలర్ స్కీం అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ఇప్పటికే గ్రూప్ కాలింగ్, డేటా ట్రాన్సఫర్, పేమెంట్స్ వంటి సదుపాయాలను కల్పించిన వాట్సాప్ ప్రస్తుతం కొత్తగా న్యూ కలర్ స్కీం తీసుకురాబోతున్నది. ఇందుకుగాను టెస్టింగ్ కోసం బీటా టెస్టర్స్‌కు అవకాశం కల్పించినట్లు వాట్సాప్ పేర్కొంది. ఇక ఈ న్యూ కలర్ స్కీం ఫీచర్‌లో వాట్సాప్‌ను లైట్ అండ్ డార్క్ థీమ్స్ మార్చుకోవచ్చని వివరించింది.
బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు సెండ్ బటన్ కూడా వినియించుకునే అవకాశం ఇందులో ఉంది. ఈ ఫీచర్ పని చేసే విధానం చాలా సులభంగా ఉంటుంది. వాట్సాప్ టాప్ బార్ సాధారణంగా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అదే న్యూ ఫీచర్‌ను కనుక వినియోగిస్తే అది గ్రీన్ నుంచి గ్రే కలర్‌లోకి మారిపోతుంది. ఇక వాట్సాప్ టాప్ బార్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ మెసేజ్ బబుల్స్, సెండ్ బటన్ చేంజ్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే చాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంతో వాట్సాప్ సంస్థ తన ప్రైవసీ పాలసీ పేరిట వ్యక్తిగత డేటా చోరీ అవుతున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ విషయమై కోర్టులో విచారణ కూడా జరిగింది. నూతన ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని పలువురు పేర్కొనగా, నూతన ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలో వాట్సాప్ నుంచి కొంత మంది యూజర్స్ బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో యూజర్స్‌కు మళ్లీ కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకుగాను వాట్సాప్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే నూతన ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఏదైతేనేం యూజర్స్‌కు ఈ ఫీచర్స్ ద్వారా మేలు జరుగుతున్నది.