టెలిగ్రామ్ సెన్సేషనల్ ఫీచర్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

టెలిగ్రామ్ తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఎంతో అద్భుతమైన ఫీచర్స్ రిలీజ్ చేసింది. అదేంటంటే ఏకంగా 1000 మంది వీడియో కాల్ చేసుకోవచ్చు. అది కూడా హై క్వాలిటీ వీడియో కాల్ అనేది విశేషం.ఇక గ్రూప్ వీడియో కాల్ వలన 1000 మందిని యాడ్ చేసే అవకాశం కల్పిస్తోంది టెలిగ్రామ్. అలాగే వీడియో మెసేజెస్ కూడా రికార్డ్ చేయొచ్చు. ఇలా అనేక కొత్త ఫీచర్స్‌ని టెలిగ్రామ్ విడుదల చేసింది. మరి లేటెస్ట్‌గా టెలిగ్రామ్ నుంచి విడుదలైన మరిన్ని ఫీచర్స్ గురించి తెలుసుకోండి.గ్రూప్ వీడియో కాల్ ద్వారా 30 మంది యూజర్ల వరకు యాడ్ అవ్వోచ్చు. అలాగే 1000 మంది కూడా ఇందులో యాడ్ కావొచ్చు.ఇంకా ఆన్‌లైన్ లెక్చర్స్ ని బాగా వినొచ్చు.ఇక ఈ సంఖ్యను కూడా త్వరలో మరింత పెంచుతామంటోంది టెలిగ్రామ్. ఇక అలాగే హై క్వాలిటీ వీడియోని రికార్డ్ చేసి షేర్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది టెలిగ్రామ్.

ఇక ఇందుకోసం కొత్త ఫీచర్ ని కూడా రిలీజ్ చేసింది.అది వీడియో రికార్డ్ చేసేప్పుడు మీ మొబైల్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ ప్లే కూడా చేయొచ్చు.ఇంకా ఏవైనా సరే వీడియో ఫైల్స్ షేర్ చేసినప్పుడు టైమ్ స్టాంప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు 0:30 అని టైమ్‌స్టాంప్ లింక్ క్రియేట్ చేస్తే ఆ టైమ్ నుంచే ఈజీగా వీడియోని చూడొచ్చు.ఇక వీడియో కాల్‌లో స్క్రీన్ షేర్ చేసే ఫీచర్ కూడా  టెలిగ్రామ్ రూపొందించింది. డివైజ్ లోని సౌండ్ కూడా బాగా బ్రాడ్‌క్యాస్ట్ అవుతుంది.ఇక అలాగే టెలిగ్రామ్‌లోని ఛాట్స్ అన్ని కూడా ఒక రోజు ఇంకా ఒక వారంలో ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు. అలాగే ఇకపై ఒక నెల రోజు కూడా టైమ్ అనేది ఈజీగా సెట్ చేయొచ్చు.అలాగే మీడియా ఎడిటర్ ద్వారా మీ ఫోటోలు ఇంకా వీడియోలను డ్రాయింగ్స్ ఇంకా టెక్స్ట్ మరియు స్టిక్కర్స్ ద్వారా డెకరేట్ చేయొచ్చు. టెలిగ్రామ్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా కూడా ఫోటోలను చక్కగా ఈజీగా ఎడిట్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: