మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం..

ఇక జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్‌ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇండియాలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా 2025 వ సంవత్సరం నాటికి ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది.ఇక ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని లాంచ్‌ చేయాలని విడుదల చేయనున్నట్లు కంపెనీ ఒక నివేదికలో పేర్కొనడం జరిగింది.మారుతి కంపెనీ భాగస్వామ్యంతో ఇండియాలో సుజుకి బాగా చలామణీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక నివేదిక ప్రకారం ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కాంపాక్ట్ కార్ల విభాగంలో జపనీస్ కార్ల తయారీ కంపెనీ సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు అభివృద్ధికి మరింత సహాయపడనుంది. ఇక ఇండియా ఆటోమొబైల్స్‌ రంగంలో మారుతి సుజుకీ అతిపెద్ద వాహన తయారీ కంపెనీగా నిలవడం జరిగింది.

ఇండియాలో మారుతి సుజుకీ అమ్మకాలు ఎక్కువగా ఆల్టో, వాగన్ఆర్, బాలెనో ఇంకా స్విఫ్ట్ వంటి చిన్న కాంపాక్ట్ కార్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తుండటం జరిగింది.ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ముందుగా ఇండియా మార్కెట్‌లో రిలీజ్‌ చేయాలని సుజుకీ కంపెనీ భావిస్తోంది. తరువాత జపాన్‌ ఇంకా యూరప్‌ వంటి ఇతర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకీ వాగన్‌ఆర్‌ వాహనాలను ఈవీగా పరీక్షిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఈ పరీక్షలపై మారుతి సుజుకీ ఆఫీషియల్ గా ధృవీకరించలేదు. మారుతి సుజుకీ కంపెనీ ఎక్కువగా సీఎన్జీ వాహన శ్రేణులపై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం 2030 సంవత్సరం నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు భారీగా ప్రోత్సాహాకాలను ప్రకటించింది.మారుతీ సుజుకి కార్లు ఇండియాలో ఎంత బాగా అమ్ముడవుతాయో తెలిసిన సంగతే.. ఇండియాలో మారుతి సుజుకి కార్లకి మంచి డిమాండ్ వుంది. అన్ని కంపెనిల కంటే ఈ కంపెనీ కార్లే ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: