బుల్లి పిట్ట: డ్రోన్ కెమెరా తరహాలో మొబైల్ కెమెరా..
సాధారణంగా టెక్నాలజీ అనేది ఎప్పుడు, ఎవరికి అనుగుణంగా , ఎలా మారిపోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రజలు ప్రతి చిన్నదానికి టెక్నాలజీ పై ఆధారపడిన నేపథ్యంలో ఎన్నో వింతలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మనం మొబైల్ అనగానే కాల్స్ ద్వారా ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకునే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ ఫోన్లలో కూడా సరి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటూనే మొబైల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించబడుతుంది.
ఇక ఇప్పుడు పరిస్థితి మారుతోంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే మొబైల్ తయారీ సంస్థలు కూడా సరికొత్త ఫీచర్లను ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కెమెరా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కంపెనీలు. సినిమా పిక్చర్ క్వాలిటీ ని తలపించేలా ఈ మొబైల్ లో తీసే పిక్చర్స్ కూడా అంతే క్లారిటీగా వస్తుండడం గమనార్హం. అందులోనూ తక్కువ ధరకే. అందుకే చాలామంది కేవలం కెమెరా ని చూసి మొబైల్ ని కొనడం ప్రారంభించారు. అయితే ఇటీవల దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ అయిన వివో ఒక సరికొత్త కెమెరాను తమ కస్టమర్ల కోసం వినియోగంలోకి తీసుకొచ్చింది.