టెరరిస్టులని చంపే సూపర్ టెక్నాలజీ...

ఇక టెరరిస్టుల కళ్లకు, బైనాక్యులర్‌కు తమ సైనికులు కనిపించకుండా ఉండటానికి ఇజ్రాయిల్‌ దేశం సరికొత్త టెక్నాలజీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా సైనికులు అంత సులభంగా టెరరిస్టులకి కనిపించరు.అందుకోసం వాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంకా భారీ ఎక్విప్‌మెంట్‌ వాడటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయిల్‌ ప్రవేశ పెట్టింది సరికొత్త కామెఫ్లాగ్‌ షీట్‌ మాత్రమే.ఇక ఈ షీట్‌ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయిల్ దేశం వారు కొత్తగా డెవలప్ చేసిన కామెఫ్లాగ్‌ షీట్‌ పేరు కిట్‌ 300. దీన్ని ఇజ్రాయిల్ దేశపు రక్షణ మంత్రిత్వ శాఖతో కలసి పొలారిస్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ తయారు చేసింది.ఇక ఈ కిట్ ని కనుక ధరిస్తే సైనికులను శత్రు సైన్యం గుర్తించడం అస్సలు సాధ్యం కాదట. దీనిని థర్మల్‌ విజువల్ కాన్‌సీల్‌మెంట్‌ (టీవీసీ)తో తయారు చేశారు. ఇక ఈ షీట్ లో మైక్రో ఫైబర్స్‌ ఇంకా మెటల్స్‌ అలాగే పాలిమర్స్‌ను ఉపయోగియోగిస్తున్నారు.

ఇక మాములుగా చూసినా లేదా థర్మల్‌ కెమెరాలతో చూసినా ఆ షీట్‌ ధరించిన వ్యక్తి అస్సలు కనిపించరట.ఇక ఇలాంటి అద్భుతమైన ఫీచర్లున్న షీట్‌ పెద్ద బరువు కూడా ఉండదట.ఈ షీట్ బరువు కేవలం 1.1 పౌండ్లు మాత్రమే ఉండటం విశేషం.అందువల్ల వల్ల సైనికులు ట్రెక్కింగ్‌ వెళ్లేటప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చట. ఇక అంతే కాదు ఈ షీట్‌లో 500 పౌండ్ల బరువును కూడా ఈజీగా తీసుకెళ్లొచ్చు. అంతేగాక ఈ కిట్‌ 300 షీట్‌ను టూ ఇన్ వన్ లాగా కూడా వాడవచ్చు. అంటే ఒక వైపు రాతి రంగుల్లో ఇంకా మరోక వైపు పచ్చని రంగులో ఉంటుంది. అంటే కొండల్లో యుద్ధం చేసేటప్పుడు అలాగే బోర్డర్ దగ్గర కాపలా చేసేటప్పుడు రాతి రంగు బయటకు కనిపించేలా ఒంటికి చుట్టుకోవాలి. ఇక అడవుల్లో ఉన్నప్పుడు పచ్చని రంగు బయటివైపు ఉండేలా చూసుకోవాలట.ఈ టెక్నాలజీతో శత్రువు కంట పడటమే కాకుండా వారిని చాలా సులభంగా హతమార్చొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: