బుల్లిపిట్ట: 2021 ఏప్రిల్ లో టాప్ ఫోన్స్ ఏవో తెలుసా..?

Divya

స్మార్ట్ ఫోన్స్ ప్రతి నెలా , ప్రతి సంవత్సరం వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మన ముందుకు వస్తూ ఉంటాయి. అయితే మీ అన్ని అవసరాలకు సరిపడేలా కేవలం 20 వేల రూపాయల బడ్జెట్ ధరలలో లేటెస్ట్ స్మార్ట్  ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా ..? అయితే వీటిని కూడా ఒకసారి చూడండి.. మంచి ఫీచర్లతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ను అందించగల ఈ స్మార్ట్  ఫోన్స్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం..
1.రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్:
రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 1200 పీక్ బ్రైట్నెస్ తో పాటుగా HDR 10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో 8gb రామ్ తో పాటు 128 జీబీ స్టోరేజ్ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా జతచేయబడింది. దీనిలో ప్రాథమికంగా 108mp ప్రధాన కెమెరా కి జత చేయగా, ఇక 8 ఎం పీ అల్ట్రా  వైడ్ యాంగిల్ కెమెరా, 5 mp సూపర్ టెలి మైక్రో కెమెరా, రెండు ఎంపీ డెప్త్ సెన్సార్లను జతచేయబడింది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇక దీని బ్యాటరీ విషయానికొస్తే , 5020 ఎమ్ ఏ  హెచ్ బ్యాటరీ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంది.
2. పోకో  ఎక్స్ 3:
6.67-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120 Hz హై-రిఫ్రెష్-రేట్ అలాగే హెచ్డిఆర్ 10 సపోర్ట్ ను  కలిగి ఉంది. ఇక ఇందులో 20 ఎం పి సెల్ఫీ కెమెరా ఉంది. ఇక బ్యాక్ కెమెరా ల విషయానికి వస్తే 64mp కెమెరాతో ఇక 8 ఎం పీ అల్ట్రా  వైడ్ యాంగిల్ కెమెరా, 5 mp సూపర్ టెలి మైక్రో కెమెరా, రెండు ఎంపీ dept సెన్సార్లను జతచేయబడింది. ఇక ఇందులో ఆరువేల ఎంఏ హెచ్ బ్యాటరీ ఉంది.
3. రియల్ మీ 8 ప్రో:
స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్  తో ఉంటుంది. ఈ ఫోన్ సిక్స్ జీ బీ నుంచి 8gb ర్యామ్ అలాగే 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఇక ఇందులో బ్యాటరీ 4580 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: