బుల్లిపిట్ట : వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..?

Divya

సాధారణంగా ఇటీవల కాలంలో చాలామంది బట్టలు శుభ్రం చేయడానికి,  వాషింగ్ మెషిన్ ల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో దోబీ ల సంఖ్య చాలా తక్కువ. పైగా  బట్టలు ఉతకడానికి నీరు కూడా సౌలభ్యంగా లేకపోవడంతో,  దోబీ లు కూడా బట్టలు శుభ్రం చేయడానికి మక్కువ చూపడం లేదు. అందుకే ప్రతి ఒక్కరు వాషింగ్ మెషిన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ వాషింగ్ మెషిన్ లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండేలాగా, రకరకాలగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే, మరొకటి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ వస్తుంది. ఇంకొకటి బట్టలు కూడా దానంతట అదే ఆరేస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అయితే ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..



వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసేటప్పుడు,  ఏదైనా మరకలు అంటిన బట్టలు విడిగా ఉతికితే మంచిది. లేదంటే ఆ మరకలు మిగతా బట్టలకు కూడా అంటుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా డిటర్జెంట్ తో పాటు ఫ్యాబ్ లెస్ సాఫ్ట్నర్ ను కూడా వాడటం మంచిది. అది బట్టల యొక్క రంగును పోనివ్వదు. దీనికి తోడు బట్టలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. అంతేకాకుండా వాషింగ్ మెషిన్ పై ఉండే బటన్స్ యొక్క సెట్టింగ్స్ ను కూడా ఖచ్చితంగా పాటించాలి. ఏ బట్టలు ఎలాంటి సెట్టింగ్స్లో సరిపోతాయో చూసుకొని వాడితో,  బట్టలు ఎక్కువ కాలం మన్నిక వస్తాయి.


అంతే కాకుండా బట్టలు ఎక్కువ కాలం మన్నిక రావాలి అంటే,  వాషింగ్ మిషన్ లో ఉన్న డ్రైయ్యర్ ని ఉపయోగించడం కంటే, ఆరుబయట సహజసిద్ధంగా ఆరేసుకోవడం అన్ని విధాలా మంచిది. అంతేకాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా ప్రతి నెల కంపల్సరిగా ఈ వాషింగ్ మిషన్ శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా వాషింగ్ మెషిన్ లో వేసే డిటర్జెంట్,వాషింగ్ మెషిన్ లో ఇరుక్కు పోతుంది. ఇది కాస్త అచ్చు లా ఏర్పడి, తరువాత బట్టలకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి వాషింగ్ మిషన్ ని శుభ్రం చేయాలి. లేదంటే వాషింగ్ మెషిన్ లో పౌడర్ కాకుండా వాషింగ్ లిక్విడ్ ను వాడడం మంచిది.. అలాగే ఉతికిన తర్వాత బయట గాలి డ్రమ్ లోపలకి వెళ్ళేటట్టుగా,  వాషింగ్ మెషిన్ డోర్ కొంచెం సేపు తెరిచి ఉంచాలి. అంతేకాకుండా బట్టలు ఉతికిన తర్వాత పొడి క్లాత్ తో తడి లేకుండా శుభ్రం చేయాలి..ఇలా చేస్తే  మెషిన్ తో పాటు బట్టలు కూడా ఎక్కువ కాలం మన్నిక వస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: