జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.!

ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వాడుతున్న నెట్ వర్క్ రిలయన్స్ జియో. జియో దెబ్బకు అన్ని టెలికాం సంస్థలు నష్టాల్లో పడ్డాయి. ఎన్నో ఆఫర్లతో వచ్చిన జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మరింత మంది కస్టమర్లకు దగ్గరయ్యేందుకు బంపర్ ఆఫర్ లను ప్రకటించింది. అమెజాన్, పేటిఎమ్, ఫోన్ పే, మొబి క్విక్, ఫ్రీ ఛార్జ్ యాప్ ల ద్వారా రీఛార్జ్ చేసుకున్న వారికి క్యాష్ బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుండి 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇక ఆ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జియోలోకి వచ్చిన కొత్త కస్టమర్లు పేటిఎమ్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే వారికి మూడు సార్లు 100 రూపాలయల ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక పాత కస్టమర్ అయితే 49 పైగా  రీఛార్జ్ చేసుకుంటే 1000 రూపాయల వరకు స్క్రాచ్ కార్ఫ్ వస్తుంది. ఇక ఫోన్ పే తో రీఛార్జ్ చేసుకుంటే..కొత్త కస్టమర్ అయితే 140..పాత కస్టమర్ అయితే 120 వరకు రివార్డు పొందవచ్చు.
ఇక అమెజామ్ నుండి రీఛార్జ్ చేసుకుంటే పాత , కొత్త కస్టమర్లకు 125 రూ. రివార్డు లభిస్తుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ను మళ్ళీ అమెజాన్ యాప్ లోనే ఉపయోహించాల్సి ఉంటుంది. మొబి క్విక్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.149 కంటే ఎక్కువపై 5శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. కాగా గరిష్టంగా మొత్తం రు.50 వరకు పొందవచ్చు.  ఇక ఫ్రీ ఛార్జ్ యాప్ ద్వారా అయితే పాత కస్టమర్లు రూ.30 కొత్త కస్టమర్లు రు.20 క్యాష్ బ్యాక్ ను పొందవచ్చ. అయితే దీనికోసం "జియో 30" మరియు "జియో 20" అనే కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.  ఇక ఈ ఆఫర్లతో జియో తమ నెట్వర్క్ ను మరింత పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: