ఈ ల్యాప్ ల రేంజ్ మాములుగా లేదుగా..

Satvika
ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ పెరగడం తో జనాలు కూడా డిజిటల్ జీవితానికి అలవాటు పడ్డారు. టీవీ లకు బదులుగా అందరూ ఇప్పుడు కంప్యూటర్లను , ల్యాప్ ట్యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు..దాంతో ల్యాప్ ట్యాప్ కంపెనీలు తమ సేల్స్ పెంచుకునేందుకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ల్యాప్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ల్యాప్ లు ఎంటో వాటి ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..


ఆసుస్‌ డ్యూయల్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్స్‌

గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన ఆసుస్, మూడో రోజు జెన్‌బుక్‌ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను ప్రదర్శించింది. జెన్‌బుక్‌ ప్రో డ్యూయో ఓఎల్‌ఈడీ, జెన్‌బుక్‌ డ్యూయో 14 పేరుతో వీటిని తీసకొచ్చారు. జెన్‌బుక్‌ ప్రో డ్యూయో ఓఎల్‌ఈడీ మోడల్‌లో 15.6-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేతో పాటు కీ బోర్డు ముందు భాగంలో సెకండరీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇంటెల్ కొత్త ప్రాసెసర్‌, ఆర్‌టీఎక్స్‌ గ్రాఫిక్‌ ఉంది. ఇక డ్యూయో 14లో 11వ జనరేషన్‌ ఐ5 లేదా ఐ7 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. నివిడా ఎమ్‌ఎక్స్‌450 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది. ఈ ల్యాప్ ట్యాప్ లు ఈ ఏడాది మూడో వారంలో అందుబాులోకి వస్తాయని అంటున్నారు.


ఎమ్‌ఎస్‌ఐ ల్యాప్‌టాప్‌

ఈ ఎమ్‌ఎస్‌ఐ కూడా గేమర్స్‌ కోసం క్రియేటర్‌ 15 ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. నివిడా ఆర్‌టీఎక్స్‌ 3000 మొబైల్ గ్రాఫిక్‌ కార్డ్‌ని ఇస్తున్నారు. క్రియేటివ్ ప్రొఫెషనల్స్‌కి ఈ ల్యాప్‌టాప్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్‌ఎస్‌ఐ తెలిపింది. 100 శాతం అడోబ్‌ ఏజీబీతో 15.6-అంగుళాల 4కే డిస్‌ప్లే ఇస్తున్నారు...వీటిని కూడా మార్కెట్ లోకి అప్పుడే విడుదల చేస్తారట.


డెల్ ఏలియన్‌వేర్‌ ల్యాప్‌టాప్స్‌

ప్రముఖ కంపెనీ డెల్ గేమర్స్ కోసం లాంఛ్ చేసిన ల్యాప్ ట్యాప్ ఇది.ఏలియన్‌వేర్‌ సిరీస్‌లో ఎమ్‌15, ఎమ్‌17 ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది. వీటిలో ఇంటెల్‌ 10వ జనరేషన్‌ ఐ7-10870హెచ్‌, ఐ9-10980హెచ్‌కే ప్రాసెసర్‌లను ఇస్తున్నారు. వీటిలో 32జీబీ ర్యామ్‌, 4టీబీ పీసీఐఈ స్టోరేజ్ సామర్థ్యం ఉంది.. కాగా, జనవరి చివరి వారంలో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: