వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్.. ధర ..?

Satvika
 వన్ ప్లస్ 9 ఫోన్ మార్కెట్ లోకి మరో ఫోన్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్ ఫీచర్లు , ధర అనేది కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆన్ లైన్ లీక్ అయ్యాయని తెలుస్తుంది. రానున్న ఫోన్ యువత బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఆ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు ఒకసారి చూసెద్దాం...

వన్ ప్లస్ 9 రానున్న 2021 కి ప్రేక్షకుల ముందుకు రానుంది.వన్‌ప్లస్ 9 సిరీస్ లో భాగంగా వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రోతో పాటు వన్‌ప్లస్ 9 లైట్‌ అనే మొబైల్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వన్‌ప్లస్ 9కి సంబందించిన ఫీచర్స్, ధర లీక్ అయ్యాయి. 91 మొబైల్స్ వెబ్ సైట్ తెలిపిన సమాచారం మేరకు వన్‌ప్లస్ 9 మొబైల్ లో కార్నర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ను చేయనున్నట్లు సమాచారం..

4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వనిల్లా వన్‌ప్లస్ 9 కూడా 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెగ్యులర్ వన్‌ప్లస్ 9 మొబైల్ లో కంటే వన్‌ప్లస్ 9 ప్రో మోడల్‌లో ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వన్ ప్లస్ 9 ,వన్ ప్లస్ 9 ప్రో రెండు ఫోన్లలో  లికా కెమరాలను కలిగి ఉంటుంది.. ఇకపోతే ఇప్పుడు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 20ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపీ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది..స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ద్వారా పనిచేయనున్నాయి. అలాగే వన్‌ప్లస్ 9 లైట్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఇన్ని అధ్బుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. వన్ ప్లస్ 9 ప్రో విషయానికొస్తే.. 50-55 వేలు , 9 ప్రో విషయానికొస్తే 60-70 వేలు ఉంటుందని అంచనా..మార్కెట్ లోకి రాక ముందే ఈ ఫోన్ కు డిమాండ్ కూడా పెరిగిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: