రెడ్ మీ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..కొత్త ఫీచర్స్ తో సరికొత్త టెక్నాలజీ తో మార్కెట్ లోకి నెలలో రెండు మూడు ఫోన్లు విడుదల అవుతుంటాయి. అలాంటిది ఇటీవల విడుదల అయినా స్మార్ట్ ఫోన్ పై ధరను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించిందిఅసలు విషయం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ను ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసింది.. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.6,799గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.6,999కి పెంచారు..ఇక 3 జీబి ర్యామ్ ఉన్న మరో స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే .7,499గానే ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌ను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది...
మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ పై రెడ్ మీ 9ఏ పనిచేయనుంది. 3 జీబి ర్యామ్, 32 జిబీ స్టోరేజ్ మెమొరి ఉంది..మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు 32 మెగా పిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ అంచులు కొంచెం మందంగానే ఉంటాయట.. ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే..5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్ మీ 9ఏ పనిచేయనుంది. ఇందులో ఉండే ఎన్ హేన్స్ డ్ లైఫ్ స్పాన్ బ్యాటరీ టెక్నాలజీ ద్వారా ఈ ఫోన్ బ్యాటరీ మూడు సంవత్సరాల పాటు మన్నికను కలిగి ఉంటుంది.4జీ ఎల్టీఈ, వైఫై బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్ బీ పోర్లు వంటి ఫీచర్లను ప్రత్యేకంగా ఫోన్ కలిగి ఉంటుంది.ఇకపోతే ఈ ఫోన్ బరువు 194 గ్రాములు ఉంటుంది..మిడ్ నైట్ బ్లాక్, నేచర్ గ్రీన్, సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.మొత్తానికి రెడ్ మీ ఫోన్ ధర మాత్రం కాస్త పెరిగింది.డిమాండ్ ను బట్టి ఇంకా పెరుగుతుందని అంచనా..