బుల్లిపిట్ట: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్!

P.Phanindra
మారుతున్న కాలానికి అనుగుణంగా యూజర్లకు కొత్తకొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. అలాగే యూజర్లు కూడా వాట్సాప్ తెచ్చే ఫీచర్లకోసం వేచి చూస్తుంటారు. రోజూ వాడే వాట్సాప్‌లో కొత్త కొత్త మార్పులు ఉండడం వల్ల బోరింగ్ ఫీల్ కలగదని యూజర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే వాట్సాప్ యాప్ కూడా కొత్త కొత్త ప్రయోగాలు చూస్తూ యూజర్లకు మరింత చేరువవుతూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఎవరికైనా వీడియోలను పంపాలన్నా ఆ వీడియోలను స్టేటస్ అప్ డేట్‌గా పెట్టుకోవాలన్నా మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ యాప్ కల్పించనుంది. అయితే ఈ ఫీచర్‌‌ను తొలుత ఆండ్రాయిడ్ యూజర్ల కోసమేనని తెలుస్తోంది. అది క్లిక్ అయితే ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటోంది.
ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ డబ్ల్యూఏబీటల్‌ఇన్ఫో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కొత్త ఫీచర్ అప్ డేట్ అయితే వీడియోతో పాటు స్పీకర్ బటన్ రూపంలో ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
 ఈ ఫీచర్‌పై వాట్సాప్ ప్రస్తుతం ప్రయోగాలు చేస్తోందని సమాచారం. 'రీడ్ లేటర్' పేరుతో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్ పై ప్రయోగాలు చేస్తోందని తెలుస్తోంది. 'రీడ్ లేటర్' పేరుతో ఈ కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారట. అయితే బీటా టెస్టింగ్ కు మాత్రం ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉందని తెలుస్తోంది. వాట్సాప్ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
బీటా టెస్టింగ్‌కు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉందట. అలాగే మరిన్ని కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు చేస్తోందట. వాట్సాప్ తెచ్చే ఫీచర్లన్నీ తమకు సౌకర్యాంగా ఉన్నాయని యూజర్లు చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: