బుల్లి పిట్ట: ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్ల ధర ఇదే..!
మీరు కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా..? సరికొత్త ఫీచర్ల తో మంచి ధరకే ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పుడు ఒప్పో స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త ఫోర్ జీబి ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేయనుంది. ఈ ఫీచర్‌ను చూసి షాక్ అవుతారు. ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికామ్ యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ సమాచారం పొందబడింది. అయితే ప్రయోగానికి ముందు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సమాచారం బయటకు వచ్చేసింది.
NEW ARRIVAL #OppoF15 - 4/128 for Rs. 16990/- pic.twitter.com/chYbYqvB3Z — mahesh Telecom (@MAHESHTELECOM) July 21, 2020
కాబట్టి ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్లు, అలానే ధర కూడా బయటకు వచ్చిన విషయాలు ఇవే. మహేష్ టెలికాం చెప్పిన ప్రకారం ఒప్పో ఎఫ్ 15 యొక్క కొత్త వేరియంట్లు యొక్క 4gb ర్యామ్+ 128gb స్టోరేజ్ ధర కేవలం రూపాయలు 16 ,990 . అలానే వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ని బ్లాక్ మరియు యునికార్న్ వైట్ కలర్ లో కొనుగోలు చేయవచ్చు. గతంలో విడుదలైన ఒప్పో ఎఫ్ 15 ఎగ్జిట్ వేరియంట్‌ను రూపాయలు 19,990 ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది ఒప్పో.
ఈ స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాలు పూర్తి హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 15 జి ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 70 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ లభిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీ వోల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ వి 4.2, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి బ్యాటరీ వచ్చేసి 4000mah ఉంది.