బుల్లిపిట్ట : అద్భుతమైన ఫీచర్లతో ఏప్రిల్ 13న రానున్న ఒప్పో ఏస్ 2... ధర ఎంతంటే...?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను తెస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. మరో 5 రోజుల్లో ఒప్పో ఏస్ 2 ఫోన్ లాంచ్ కానుంది. ఏప్రిల్ 13న లాంచ్ అవుతున్న ఈ ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుండగా ఆ తర్వాత ఇండియాలో లాంచ్ కానుంది. 2019 అక్టోబర్ లో ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో ఆ ఫోన్ కు తర్వాత వెర్షన్ గా ఈ ఫోన్ ను లాంచ్ చేయనుంది.
అయితే ఒప్పో రెనో బ్రాండ్ ను తీసేసి ఒప్పో ఏస్ 2 పేరుతో లాంచ్ చేయనుంది.
ఫీచర్లు :
6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే
యాస్పెక్ట్ రేషియో 20 : 9
ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్
5g + క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్
3910 ఎంఏహెచ్ బ్యాటరీ
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 2 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ (రెండు వేరియంట్లు)
43 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా
16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
65 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 40వ్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లు
ధర : 40,000 రూపాయలు (మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం)