రాంగ్‌ ప్లేస్‌లో పార్క్‌..భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురా రా...!

Varma Vishnu
 పట్టణాల్లో ట్రాఫిక్‌ను  కంట్రోల్‌ చేయడం అంటే  చిన్న విషయమేమి కాదు. వాహనదారులను ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించకుండా,పాటించేలా చేయడానికి పోలీసులు ఒక్కోసారి నానాతంటాలు పడుతుంటారు.వాహనాలను రాంగ్‌ పార్కింగ్‌లో నిలిపినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా ట్రాఫిక్‌ పోలీసులు విజిల్స్‌తో హెచ్చరిస్తుంటారు.. అయినా పట్టించుకోకుండా వాహనదారులలో కొంతమంది తాము వెళ్లాలనుకున్న దారిలోనే వెళ్తుంటారు కూడా.

ఇలాంటి  తరుణంలో వాహనదారుల చేష్టలపై  చిర్రెత్తుకువచ్చి.. క్రమశిక్షణ లేని వాహనదారులను దారిలో పెట్టేందుకు ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ సరికొత్త దారి ఎంచుకున్నారు. ఇందుకోసం పాప్‌ సింగర్‌ అయిన దలేర్‌ మెహేంది,పాడిన ‘భోలో తరా రా రా’ పాటను ఫాలో అయ్యారు ఆయన.దీంతో ఆ పాట విన్న వాహనదారులు అంతా అప్రమత్తమవుతున్న వీడియోను చూసి ప్రముఖ పాప్‌ సింగర్‌ దలేర్‌ మహాంది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

వివరాలులోకి వెళ్ళితే,చండీగడ్‌లోని ఓ ట్రాఫిక్‌ పోలీసు వాహనాలను రాంగ్‌ ప్లేస్‌లో పార్క్‌ చేయగానే మైక్‌లో ప్రముఖ పాప్‌ సింగర్‌ దలేర్‌  పాడిన పాపులర్‌ పాటను తలదన్నెలా  భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురావాలా  అంటూ మైక్ లో పాట పాడి ట్రాఫిక్‌ను  కంట్రోల్‌ చేస్తున్నారు.దీనికి  దలేర్‌ స్పందిస్తూ,నా పాటతో ప్రజలను ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా  చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనందం అంటే దలేర్‌,వేడుక అంటే దలేర్‌ మహాంది. మీ సపోర్టుకు నా ధన్యవాదాలు.. ఐ లవ్‌ యూ  అనే క్యాప్షన్‌  పెట్టి  దలేర్‌ ఈ వీడియోను గురువారం తన అకౌంట్లో షేర్ చేశారు.

ఇక అప్పటినుంచి వీడియోకు వేలల్లో వ్యూస్‌ వస్తున్నాయి,వందల్లో లైక్స్‌  కూడా వచ్చాయి. నేటికీ  వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే  భలే భలే .. ఇది చాలా బాగుంది, మంచి ఐడియా, సింగ్‌ గారి నో పార్కింగ్‌  సాంగ్‌  అంటూ నెటిజన్లు కామెంట్స్‌కూడా  చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పాప్‌స్టార్‌ దలేర్‌... ‘స రి గ మ పా’ అనే మ్యుజిక్‌ రియాలీటి షోలో జడ్జీగా వ్యవహరిస్తున్న అందరికి తెలిసిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: