"ఎయిర్టెల్"..వినియోగ దారులకి...."షాకింగ్ న్యూస్"...!!!

NCR

టెలికం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగ దారులకి షాక్ ఇచ్చింది. ఇప్పటికే జియో ఎఫెక్ట్ తో కుప్పకూలిపోయిన ఎయిర్టెల్ మార్కెట్ ఇప్పుడు ఎయిర్టెల్ తాజా నిర్ణయంతో మరింతగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడనుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎయిర్టెల్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే..వాలిడిటీ ముగిసిన తరువాత ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ పొందేటువంటి గడువుని ఇక నుంచీ కేవలం 7 రోజులకే పరిమితం చేయనుంది.

 

ఎయిర్టెల్ ఇప్పటి వరకూ ఈ అవకాశాన్ని 15 రోజుల వరకూ వెసులుబాటు ఇవగా తాజాగా దాన్ని వారానికి తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం కష్టమర్లకి షాక్ ఇచ్చినట్టయ్యింది. వారం తరువాత గనుకా రీచార్జ్ చేయించకపోతే మాత్రం ఇన్ కమింగ్ కాల్స్ బంద్ అన్నట్టేనని చూచాయిగా తెలిపింది. అయితే ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే..

 

వినియోగ దారులు పొందే యావరేజ్ రెవెన్యూ పెంచడానికే నని అంటున్నారు నిపుణులు. అయితే ఇదే బాటలో వొడా ఫోన్ సంస్థ సైతం పయనించ నున్నట్టుగా తెలుస్తోంది.  కానీ  ఈ విషయంపై ఎటువంటి సమాచారం అధికారికంగా బహిర్ఘతం కాలేదు. గతంలో పోల్చుకునే ఇప్పుడు నష్టాలలో ఉన్న ఎయిర్టెల్ ఈ నిర్ణయంపై వినియోగ దారులు పెదవి విరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: