టివి: డాకు మహారాజ్ లో కనిపించిన ఈ బిగ్ బాస్ బ్యూటీ గుర్తుపట్టారా..?

frame టివి: డాకు మహారాజ్ లో కనిపించిన ఈ బిగ్ బాస్ బ్యూటీ గుర్తుపట్టారా..?

Divya
నందమూరి బాలకృష్ణ ఇటీవలే నటించిన చిత్రం డాకు మహారాజ్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి తెరకెక్కించగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్గా నటించిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ కి కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. మొదటిరోజు బాలయ్య భారీ కలెక్షన్స్ తో దూసుకొచ్చారు. ఇప్పటికే 92 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. బాలయ్య నటన ఫైట్స్ ,యాక్షన్స్ సన్ని వేషాలు, బిజిఎం అన్ని కూడా డాకు మహారాజ్ సినిమాకి ప్లస్సులుగా మారాయి. ఈ సినిమాలో చాలామంది తెలుగు నటులే కాకుండా ఇతర భాషలలోని నటి  నటులు కూడా నటించారట. డైరెక్టర్ సందీప్ రాజ్, హర్షవర్ధన్, రవి కిషన్, షైన్ టామ్ చాకో ఇలా వీరే కాకుండా చాలామంది ఈ చిత్రంలో కనిపించారు.

అయితే ఇందులో బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న దివి కూడా ఒక కీలకమైన పాత్రలో నటించిందట. ముఖ్యంగా బాలకృష్ణకు సహాయపడే ఝాన్సీ అనే పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఇమే ఒక ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దిగిన తన పాత్ర ఫోటో అన్నట్లుగా తెలియజేసింది బిగ్ బాస్ దివి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

బిగ్బాస్ దివి సీజన్ 4లో అడుగుపెట్టి భారీ క్రేజీ సంపాదించుకున్నది. ఆ తర్వాత పలు రకాల టీవీ షోలలో ,ప్రోగ్రామ్లలో కూడా సందడి చేసింది.ఈ మధ్యకాలంలో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని పలు చిత్రాలను నటిస్తూ ఉన్నది. లంబసింగి, హరికథ ,గాడ్ ఫాదర్ ఇతరత్రా చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ. మరి రాబోయే రోజుల్లో హీరోయిన్గా ఏవైనా అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: