సంక్రాంతికి వస్తున్నాం: 'బుల్లిరాజు' బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.?

frame సంక్రాంతికి వస్తున్నాం: 'బుల్లిరాజు' బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.?

FARMANULLA SHAIK
సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి ముగిసింది. జనవరి 10న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కాగా, జనవరి 12న నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలు వచ్చాయి.జనవరి 14న విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిలీజ్ అయ్యింది. లేటుగా వచ్చినా ముందు వచ్చిన రెండు సినిమాల కంటే బాక్సాఫీస్‌ని అల్లాడిస్తూ సంక్రాంతి 2025 విన్నర్‌గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.ఈ సినిమా రిలీజ్‌కి ముందే అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. రిలీజ్ తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్ రావడంతో జనవరి 15న కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మంచి బుకింగ్స్ జరిగాయి.సాధారణంగా వెంకీ నటించే సినిమాల్లో అటెన్షన్ అంతా ఆయనకే దక్కుతుంది. 'F2' మూవీలో యంగ్ హీరో వరుణ్ తేజ్‌ని పూర్తిగా డామినేట్ చేశాడు వెంకటేశ్అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో మాత్రం వెంకటేశ్ కొడుకు 'బుల్లిరాజా'గా నటించిన బుడ్డోడు, ఫస్టాఫ్‌లో పూర్తిగా డామినేట్ చేశాడు. బుల్లిరాజా సీన్స్‌కి థియేటర్ల అంతా నవ్వుల వర్షం కురుసింది.ఇంతకీ ఎవరీ బుల్లిరాజా.బుల్లి రాజుగా నటించిన కుర్రాడి పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తర్వాత ఈ బుడ్డోడు, టాలీవుడ్‌లో బాగా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మాస్టర్ భరత్ తర్వాత నవ్వించే ఛైల్డ్ ఆర్టిస్ట్‌లు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు రేవంత్‌, భరత్ ప్లేస్‌ని రిప్లేస్ చేయగల బుల్లి కమెడియన్‌గా కనిపిస్తున్నాడు.ఇక తన టాలెంట్ ని గుర్తించి సినిమాలో అద్భుతమైన పాత్రను క్రియేట్ చేసిన అనిల్ రావిపూడి గ్రేట్ అని చెప్పాలి.ఇక ఈ సినిమాలో అతని పాత్ర చిన్నపిల్లలనే కాకుండా పెద్దవాళ్ళను కూడా అలరిస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన పిల్లల పాత్రల్లో రేవంత్ చేసిన బుల్లిరాజు పాత్ర నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి.ఇక ఈ సంక్రాంతి సినిమాల్లో విక్టరీ వెంకటేష్ సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వెంకీకి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, తన తర్వాతి సినిమాని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఈ సినిమాలో కూడా బుల్లి రాజు రేవంత్‌కి కూడా ఓ మంచి రోల్ ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: