తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ తన కెరియర్లో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలలో హీరో గా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే విక్టరీ వెంకటేష్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం దక్కి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చాలా సినిమాలు నేరుగా ఓ టీ టీ లో విడుదల అయ్యాయి. ఇకపోతే పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెంకటేష్ హీరోగా రూపొందిన సైంధవ్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.
చాలా కాలం తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సినిమా థియేటర్లలో విడుదల అవుతూ ఉండడం , ఆ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంతనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన థియేటర్లో విడుదల చేశారు. ఇక ఈ మూవీ కి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తుంది.
ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధిస్తుంది అని వెంకీ అభిమానులు గట్టిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే చాలా రోజుల తర్వాత వెంకటేష్ కి ఈ మూవీ ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం తక్కినట్లు అవుతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.