
దిల్ రూబా రివ్యూ.. హీరో కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ హిట్ సాధించారా?
కథ :
సిద్దార్థ్ అలియాస్ సిద్ధు(కిరణ్ అబ్బవరం) లవ్ ఫెయిల్యూర్ అయిన కుర్రాడు కాగా తన తండ్రి ఒక ఫ్రెండ్ చేతిలో మోసపోయి చనిపోతారు. అదే సమయ్లో ఊహించని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయి అయిన నజియా(మ్యాగీ)కి దూరమవుతాడు. బ్రేకప్ వల్ల బాధ పడుతున్న సిద్దార్థ్ బెంగళూరుకు వెళ్లగా అక్కడ అంజలి (రుక్సార్ థిల్లాన్) పరిచయం అవుతుంది. అనుకోని సంఘటన వల్ల అంజలికి సిద్ధుపై ఇష్టం ఏర్పడి ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది.
సిద్ధు మొదట నో చెప్పి తర్వాత ప్రేమకు ఓకే చెప్పగా కొన్ని కారణాల వల్ల సిద్ధు, అంజలి మధ్య విబేధాలు వస్తాయి. అంజలి సారీ చెప్పాలని పట్టుబట్టగా సిద్ధు ఎందుకు సారీ చెప్పాడు? మ్యాగీ సిద్ధు, అంజలిలను ఎలా కలిపింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
కొన్ని కథలు లైన్ పరంగా బాగానే ఉన్నా కథనం పరంగా మెప్పించే విషయంలో ఫెయిల్ అవుతుంటాయి. దిల్ రూబాస్ సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుందని చెప్పవచ్చు. హీరో సారీ, థ్యాంక్స్ చెప్పలేకపోవడానికి కారణాలేంటి? చివరకు హీరో సారీ చెప్పాడా? అనే సింపుల్ లైన్ తో సినిమా తెరకెక్కింది. కథనం అద్భుతంగా ఉంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది కానీ కథనం విషయంలో పొరపాట్లు జరగడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.
ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు సైతం మరీ అద్భుతంగా లేవు. మాజీ ప్రేయసి మ్యాగీ గర్భవతిగా ఉన్నప్పటికీ సిద్ధు, అంజలిలను కలిపే ప్రయత్నం చేయడం అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించదు. కిరణ్ అబ్బవరం తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. రుక్సార్ తన నటనతో ఆకట్టుకోగా నజియా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగానే ఉన్నా దర్శకుడు కథ ఎంపికలోనే పొరపాటు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బలాలు : కిరణ్ అబ్బవరం యాక్టింగ్, ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, మ్యూజిక్
బలహీనతలు : సెకండాఫ్, ఎమోషనల్ సీన్స్, కథ, డైరెక్షన్
రేటింగ్ : 2.25/5.0