స‌న్నీ లియోన్ తో అష్షు రెడ్డి.. బాబోయ్ ఇదేం కాంబినేష‌న్ రోయ్!

frame స‌న్నీ లియోన్ తో అష్షు రెడ్డి.. బాబోయ్ ఇదేం కాంబినేష‌న్ రోయ్!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకున్న గ్లామరస్ బ్యూటీ సన్నిలియోన్. ఈమె అసలు పేరు కరెన్‌జిత్ 'కరెన్' కౌర్ వోహ్రా కానీ రంగస్థల పేరు మాత్రం సన్నీ లియోన్‌. ఈమె కెనడియన్ అమెరికన్ నటి అలాగే మోడల్. ఆమె స్వతంత్ర ప్రధాన స్రవంతి ఈవెంట్‌లు, చలనచిత్రాలు మరియు టెలివిజన్ ధారావాహికలలో కూడా పాత్రలు పోషించింది. ఈమె MTV ఇండియాలో MTV వీడియో మ్యూజిక్ అవార్డ్స్ కోసం రెడ్ కార్పెట్ రిపోర్టర్‌గా పని చేసింది. అందాల భామ  సన్నిలియోన్ ఇండియన్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. అంతేకాకుండా ఈమె భారతీయ రియాలిటీ షోలలో కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. సన్నిలియోన్ అంటారియోలోని సర్నియాలో సిక్కు భారతీయ పంజాబీ తల్లిదండ్రులకు జన్మించింది.
సన్నిలియోన్ ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో కనిపించింది. తన అందాచెందాలతో కుర్రకారుల మనసును దోచుకుంది. ప్రస్తుతం ఈమె మరో తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈమె త్రిముఖ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీలో నటుడు యోగేష్ కల్లే హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సన్నీలియోన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
తనతో పాటు ఈ సినిమాలో నాజర్, CID ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషురెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారాట. ఈ సినిమా అకిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే నిర్మాణంలో రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ పూర్తి అయ్యింది. త్రిముఖ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఈ సంవత్సరంలో రిలీజ్ కానుంది. నేడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ లో స‌న్నీలియోన్ తో పాటు అష్షు రెడ్డి కూడా కనిపించడంతో.. బాబోయ్ ఇదేం కాంబినేష‌న్ రోయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ ల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: