టీజర్: జైలర్ -2 లోడింగ్.. మేస్మరైజ్ చేస్తున్న రజనీకాంత్.. టీజర్ అదుర్స్..!
ఈ సినిమా హిట్ అవ్వడంతో కచ్చితంగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం కూడా అనౌన్స్మెంట్ చేసింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా నుంచి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేయక అదిరిపోయినట్టు కనిపిస్తోంది. ఈ టీజర్ లో రజనీకాంత్ కి అదిరిపోయే ఎలివేషన్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఇచ్చారు. టీజర్లో అనిరుద్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ గురించి కూడా సినిమా గురించి చర్చించుకుంటూ ఉండగా రజనీకాంత్ కొంతమందిని చంపుతూ లోపలికి ఎంట్రీ ఇస్తారు.
రజనీకాంత్ జస్ట్ అలా నడిచి వస్తూ ఉన్నప్పటికీ ఎలివేషన్స్ తోనే అనిరుద్ టీజర్ హైప్ పెంచేశారు. గత కొంతకాలంగా జైలర్-2 లో బాలకృష్ణ గెస్ట్ రోల్ గా నటించబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. గతంలో జైలర్ సినిమాలో అనుకున్న అది కుదరలేదని డైరెక్టర్ కూడా వెల్లడించారు. దీంతో కచ్చితంగా ఈ చిత్రంలో బాలయ్య బాబు ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా 2025 లోని రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందట. చివరిగా రజనీకాంత్ వెట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. కూలి అనే చిత్రంలో నటిస్తూ ఉండగా ఈ చిత్రానికి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు.