క్రికెటర్లు భార్యలతో కలిసి ఉండటంపై.. బీసీసీఐ నిర్ణయం?

frame క్రికెటర్లు భార్యలతో కలిసి ఉండటంపై.. బీసీసీఐ నిర్ణయం?

praveen
టీమ్ ఇండియా ఆటతీరుపై జరిగిన రివ్యూలో బీసీసీఐ ఓ కాంట్రవర్షియల్ వాదన చేసింది. అది వింటుంటేనే చాలామందికి మండిపోతోంది. ఆటగాళ్ల భార్యలు జట్టు ప్రదర్శనను దెబ్బతీస్తున్నారని బీసీసీఐ నిందించిందట. జస్ప్రీత్ బుమ్రా ఓ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ అతని భార్య అతనిపై ఎఫెక్ట్ కలిగి ఉంటే ఇంత పర్ఫామెన్స్ కనబడుతూ ఉండేవాడు కాదు కదా. అతని అద్భుతమైన ప్రదర్శన ఈ వాదనకు చెంపపెట్టులాంటిది. అతని భార్య సంజనా గణేషన్ అతనికి పరధ్యానంగా మారిందా, అంటే అస్సలే కాదు.
ఒకవేళ బీసీసీఐ లేదా కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ లాంటి వాళ్లు దీన్ని నిజంగా నమ్ముతుంటే, వారి ఆలోచనలు ఎంత దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు ఎంత అన్యాయమో కదా, జట్టు కోసం అతను తన శాయశక్తులా కష్టపడ్డాడు. ఎక్కువ రోజులు ఆడటం వల్ల సిడ్నీ టెస్ట్ సమయంలో గాయాలపాలయ్యాడు. కానీ ఇప్పుడు నిందలు మాత్రం భార్యలపై వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది నిర్వహణ లోపం కాదా అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు.
మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ గురించే ఆలోచిస్తూ అవుటయ్యాడా? లేక కేఎల్ రాహుల్ తన భార్య ఆథియా శెట్టి ఆస్ట్రేలియాలో ఉందని సరిగ్గా ఆడలేకపోయాడా? ఇలాంటి వాదనలు వింటుంటే నవ్వొస్తుంది. కరోనా సమయంలో బయో-బబుల్స్‌లో ఉండి కుటుంబాలకు దూరంగా ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు వారి భార్యలే ఆటలకు అడ్డు అంటున్నారు. బీసీసీఐకి కనీసం మానవత్వం ఉందా? అని అభిమానులు మండిపడుతున్నారు.
ఇంకో విషయం ఏంటంటే.. బీసీసీఐ ‘భార్యలు’ అనే పదాన్ని ‘వాగ్స్’ (WAGs) లేదా (wives and girlfriends)తో ముడిపెడుతోంది. ఫుట్‌బాల్, టెన్నిస్‌లో ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి వెళ్తుంటారు. దాన్ని ఎవరూ తప్పుగా చూడరు. మన ఆర్. అశ్విన్ భార్య ప్రీతి ఆస్ట్రేలియాలో తన భర్త కష్టకాలంలో ఎంతగానో అండగా నిలిచింది.
బాధ్యతలను గుర్తించే పేరుతో భార్యలను టార్గెట్ చేయడం బీసీసీఐ చేస్తున్న అతిపెద్ద తప్పు. దీనికి బదులు కోచింగ్, జట్టు నిర్వహణను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. కోచ్ గౌతమ్ గంభీర్‌తో సహా మిగతా కోచ్‌లు కూడా పేలవమైన ఫలితాలకు బాధ్యత వహించాలి. లేదంటే ఆటగాళ్ల కుటుంబాల గౌరవాన్ని అనవసరంగా దెబ్బతీయడమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: