గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ ‘అఖండ 2: తాండవం’ కోసం నాల్గవ సారి కలిసి పని చేస్తున్నారు.అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ మూవీతో మరో సక్సెస్ ను తన ఖాతలో వేసుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో 60 ప్లస్ ఏజ్ లో ఏ హీరో వరుసగా నాలుగు సక్సస్ లు అందుకోలేదు.. ఇదో ప్రపంచ రికార్డు.. అంతేకాదు.. ఓ నట వారసుడిగా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న ఏకైక హీరో.. బాలకృష్ణ మాత్రమే అని చెప్పాలి. తాజాగా ఇపుడు అఖండ మూవీకి సీక్వెల్ గా ‘అఖండ 2 తాండవం’ పేరుతో ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కిస్తన్నట్టు ప్రకటించడమే కాదు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు రీసెంట్ గా జరిగాయి. తాజాగా జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్దమైన కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ అఘోరాలు, నాగ సాధువుల మధ్య ఘనంగా జరిగింది. అంతేకాదు 45 రోజులు పాటు జరిగే కుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేయనున్నారు.
బోయపాటి శ్రీను తో బాలకృష్ణకు ఇది నాల్గో చిత్రం కావడం విశేషం.ఈ సినిమాను హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా అఖండను మించేలా తెరకెక్కించబోతన్నారు. బాలకృష్ణ కూతురు ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. 'అఖండ 2' న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో జనవరి 13న గ్రాండ్ గా స్టార్ట్ చేయడం విశేసం. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2 ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్యతో థమన్ కు ఇది ఆరో చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు సి రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణుల ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 25 సెప్టెంబర్ 2025న విజయ దశమి కానుకగా సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.