తన ఫ్యామిలీ మెంబెర్స్ తోనే సినిమా కానిచ్చేసిన అనిల్..ఐడియా అదిరిందిగా..!!

frame తన ఫ్యామిలీ మెంబెర్స్ తోనే సినిమా కానిచ్చేసిన అనిల్..ఐడియా అదిరిందిగా..!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు.ఇప్పటికే ఆయన చేసిన ఏడు సినిమాలు మంచి విజయాలను సాధించాయి.ఈ నేపథ్యంలో నే వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నేడు థియేటర్లలోకి వచ్చేసింది.అనిల్ రావిపూడి-వెంకటేశ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినబడుతోంది. ముఖ్యంగా, వెంకీ కామెడీ సినిమాకి హైలెట్ గా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు రూపంలో తెలుపుతున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే, ఈ సినిమాలో మనం ఊహించలేని బిగ్ సర్ ప్రైజ్ లు చాలానే ఉన్నాయని మూవీ చూసిన వాళ్ళు చెబుతున్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి వాళ్ళ నాన్నను  సినిమాలో చూసి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు. అంతే కాదు ఈ చిత్రాన్ని నిర్మించిన శిరీష్  కూడా కనిపించారు. సాధారణంగా ఈయన స్టేజ్ మీద కూడా మాట్లాడరు కూడా అలాంటిది సినిమాలో నటించాడంటే చాలా గొప్ప విషయం. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ కూడా మూవీలో ఒక స్పెషల్ రోల్ చేసారని , అతని క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌ ఉంటుందని ఎక్స్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి, అనిల్ రావిపూడి ఫ్యామిలీ మెంబర్స్ ను యాక్టర్స్ గా మార్చి హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: