టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు తమన్. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. అంతే కాకుండా సినిమా ఎలా ఉన్నా.. తమన్ అందించిన సంగీతం మాత్రం ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసేస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగిన మూడు సినిమాల్లో రెండు సినిమాలకు తమనే సంగీతం అందించాడు. ఆ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. అలా మరెన్నో చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు తమన్.ఇదిలావుండగా సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితమే ఈ సినిమా మొదలైనా మెల్లగా వర్క్ జరుగుతూ వచ్చింది. 'కల్కి' సినిమా విడుదల తర్వాతే రాజాసాబ్ స్పీడ్ అందుకుంది అని నిర్మాత విశ్వ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా గురించి వార్తలు వచ్చిన సమయంలో తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా మారుతిని బాయ్‌కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.కట్ చేస్తే అదే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ లుక్, ముగ్గురు హీరోయిన్స్, సంజయ్ దత్ పాత్ర ఇలా కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు ఖాయం అనిపిస్తుంది.
పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్‌తో ప్రభాస్ రాబోతున్నారు.బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో పాటు ఆ తర్వాత వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ భారీ యాక్షన్ సినిమాలు. రెగ్యులర్ ఫార్మట్‌కి భిన్నంగా ఉంటూ వచ్చాయి. అందుకే మాస్ సాంగ్స్‌కి ఆ సినిమాల్లో స్కోప్ లేదు. ఎట్టకేలకు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో పూర్తి స్థాయి మాస్ ఆల్బమ్‌ను రెడీ చేస్తున్నట్లుగా సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పాటలెలా ఉండబోతున్నాయో కూడా హింట్ ఇచ్చేశాడు. ఆల్బమ్‌లో 6-7 పాటలుంటాయి. నాలుగు పూర్తి చేశాం. మిగిలినవి కంప్లీట్ చేయాల్సి ఉంది. సినిమాలో 30-40 ఓఎస్‌టీ ట్రాక్స్ ఉండబోతున్నాయి. ఇవి టాలీవుడ్‌లో బెస్ట్ ఓఎస్‌టీగా నిలువబోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆల్బమ్‌లో ఇంట్రడక్షన్ సాంగ్, మాస్ నంబర్, ఐటెం సాంగ్, ముగ్గురమ్మాయిలతో సాంగ్ 3 పాటలు తోపాటు థీమ్ సాంగ్ కూడా ఉండబోతుందని, రాజాసాబ్ కోసం డిఫరెంట్ వరల్డ్‌ను సృష్టిస్తున్నామని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నాడు థమన్.ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అద్భుతమంటూ ఆకాశానికెత్తేశాడు థమన్.ఇక ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.