టీవీ: మత్తిచ్చి, రేప్ చేయాలనుకున్నాడా..? రష్మి సంచలన వ్యాఖ్యలు..!

Divya
బాలీవుడ్ సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రష్మీ దేశాయ్ కూడా ఒకరు.. ఈమె పలు రకాల రియాల్టీ షోలలో కూడా పాల్గొనిందట .అలాగే భోజపురి నటిగా కూడా  పాపులారిటీ సంపాదించుకుంది. 2006లో జీటీవీలో ప్రసారమైన రావణ్ అనే సీరియల్ లో కూడా నటించిందట. అలాగే బిగ్ బాస్ సీజన్-13 లో నటుడు సిద్ధార్థ సుక్లాత ఈమె గొడవ పడడంతో మరింత పాపులారిటీ సంపాదించకున్నది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు జరిగిన ఒక క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడడం జరిగింది వాటి గురించి చూద్దాం.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక డైరెక్టర్ దగ్గరకి ఆడిషన్ కోసమని వెళ్ళామని అయితే తన వయసు అప్పుడు 16 సంవత్సరాలని.. ఆడిషన్ కి వెళ్లడానికి ముందు తనని సింగల్ గానే రమ్మన్నారని తెలిపింది రష్మీ దేశాయ్.. అయితే తను వెళ్లడానికి ముందు ఒక జ్యూస్ ఇచ్చారని.. దీనివల్ల తాను కళ్ళు తిరిగి పడిపోయానని తెలిపింది.. అది అదునుగా చూసుకున్న డైరెక్టర్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ తెలియజేసింది.. ముఖ్యంగా కూల్ డ్రింకులో మత్తుమందు ఇచ్చినట్టుగా అనిపించింది అంటూ తెలిపింది రష్మి దేశాయ్.

కానీ తాను కొంచమే తాగడం వల్ల ఆరితేరి ఆ డైరెక్టర్ యొక్క కపట బుద్ధిని అర్థం చేసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. అయితే ఈ విషయం గురించి తన తల్లితో కూడా చెప్పానని ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు మళ్లీ అక్కడికి ఆడిషన్ కి తన తల్లితో పాటు వెళ్లి ఆ డైరెక్టర్ కి తగిన బుద్ధి చెప్పామంటూ తెలియజేసింది. కానీ రష్మీ మాత్రం తనకు ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ పేరు మాత్రం తెలియజేయలేదు. ఇప్పటికీ ఆ డైరెక్టర్ తనను చూస్తే భయపడతారు అంటూ తెలియజేసింది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమా ద్వారా వెండితెర పైన ఎంట్రీ ఇచ్చిందట. 2012లో సందీప్ సందును వివాహం చేసుకోగా 2016లో విడాకులు తీసుకున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: