వేరేవాళ్లు అయితే చెప్పుతో కొట్టేదాన్ని.. జబర్దస్త్ రోహిణి ఫైర్..!

lakhmi saranya
కామెడీ స్టార్ రోహిణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. జబర్దస్త్ లో కామెడీ సీన్స్ చేస్తూ ప్రేక్షకులనే బాగా కట్టుకుంది. ఇక సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ. అలా ఫేమస్ అయినా వారిలో రోషిని ఒకరు. ఇక ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్ లో స్మెల్ వస్తుంది. ఎందుకంటే తను నటనతో, కామెడీ టైమిగ్స్ తో అంతలా ఆకట్టుకుంది రోహిణి. ఈమె కెరియర్ స్టార్టింగ్ లో సీరియల్స్ లో నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత పాపులారిటీ అయితే రాలేదు. తరువాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లే అవకాశాన్ని సంపాదించుకున్నది. దీనితో మరింత క్రేజ్ వచ్చింది. ఇలా ఓ పక్క పలు షోలు, మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

అదే విధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది రోహిణి. ఇదిలా ఉంటే ఈమె రేవ్ పార్టీలో దొరికిపోయినట్లుగా ఓ ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసింది. మొదట్లో అందరూ షాక్ అవ్వగా తరువాత అది ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఓ జర్నలిస్టు మాత్రం ఆమె పై కాంట్రవర్సి కామెంట్స్ చేశారు. దీనితో తాజాగా దీనిపై స్పందిస్తూ..సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిణి మాట్లాడుతూ..నేను బర్త్ డే బాయ్ అనే దానికి ప్రమోషన్ చేశాను. అది వీడియో ప్రమోషన్ కోసం చేశానని మీడియా తెలుసుకుని దానిని ఫన్నీ వీడియో గా తీసుకున్నారు. కానీ, ఓ సీరియల్ జర్నలిస్ట్ మాత్రం నా గురించి తప్పుగా మాట్లాడారు. ఓ వీడియోలో కూర్చుని నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. రేవ్ పార్టీ అనగానే నిజంగానే దొరికే ఉంటుందని..నిప్పు లేకుండా పొగ రాదని అన్నారు.

ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకునే మాట్లాడాలి. ఏమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడుతారు..? పైగా ఆయన సీరియల్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు. మరి అతను అలా ఎలా మాట్లాడుతారు. నేను మందు కూడా తాగను..అందులో చూపించేవి అన్నీ నిజం కాదు. అలాగే ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాడు. నేను సర్జరీ చేయించుకోవటం వల్లే లావు అయ్యాను అని అందుకే పెళ్లి కాలేదు అందుకే అలా ఉండిపోయింది అని అన్నాడు. లావుగా ఉంటే పెళ్లి కాదా..సీరియల్ కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా అయితే మాత్రం చెప్పు తీసుకుని కొట్టే దాన్ని అంటూ గట్టిగా ఇచ్చి పడేసింది జబర్దస్త్ రోహిణి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: