టీవీ: ముగ్గురితో లవ్ ట్రాక్ అంటూ బాంబు పేల్చిన శ్రీముఖి.. అసలు ఏమిటంటే..?
సూపర్ సింగర్స్ లో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో పంచులు వేస్తూ ఉండాలి తనకు ఈ షోలో ఇద్దరు ముగ్గురు తో లవ్ ట్రాక్లు ఉన్నాయని చాలా ఫన్నీగా తెలియజేసింది శ్రీముఖి.. మొదట్లో వెంకటేష్ అనే అబ్బాయి తో.. ఆ తర్వాత రాహుల్ తో.. ఆ తర్వాత అనంత శ్రీరామ్ తో లవ్ ట్రాక్ ఉన్నాయని అవసరాన్ని బట్టి కొనసాగిస్తూ ఉంటానని శ్రీముఖి తెలియజేసింది.. ప్రస్తుతం శ్రీముఖి చెప్పిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.. తనదైన స్టైల్ లో యాంకర్ గా చేస్తూ పలువురిని మెప్పించిన శ్రీముఖి వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది నుంచి ఎక్కువగా శ్రీముఖి పైన పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తూ ఉండేవి వాటన్నిటికీ చెక్ పెడుతూ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది శ్రీముఖి. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే పెట్టానని ఇటీవలే వెల్లడించింది సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ వంటి వాటిలో ఆఫర్ వచ్చిన రన్నర్ గా నిలిచిపోయింది శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర వెండితెర పైన తన హవా కొనసాగించాలని చూస్తూ ఉంది. ప్రస్తుతం ఒక్కో షో కీ రూ .2లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది శ్రీముఖి.