టీవీ: అవకాశం కోసం వాళ్ల కోరికలు తీర్చా షాకింగ్ కామెంట్స్ చేసిన నటి జయలలిత..!!

Divya
సీనియర్ నటి జయలలిత తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి.. మొదట హీరోయిన్గా ప్రారంభించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అలాగే పలు సీరియల్స్ లో కూడా నటిస్తోంది.. నటిగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈమె ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా చాలా మంది దర్శక నిర్మాతలు తనని శారీరకంగా వాడుకున్నట్లుగా తెలియజేసింది.. కొంతమంది నుంచి తప్పించుకోగలిగాను కానీ మరి కొంతమంది నుంచి తప్పించుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ గా తెలియజేసింది నటి జయలలిత.. ఇమే మాట్లాడిన మాటలు గురించి ఇప్పుడు చూద్దాం..

కెరియర్ ప్రారంభంలో తాను హీరోయిన్గా ఎదగాలని అనేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో తనకు పలు రకాల క్యారెక్టర్లలో అవకాశాలు వచ్చాయని ఎక్కువగా శృంగార హాస్య పాత్రలలో నటించడం జరిగిందని.. ఆ సమయంలో తనని ఎక్కువగా ఎవరూ పట్టించుకోలేదని.. సినిమా షూటింగ్స్ స్పోట్లో ఉన్నప్పటికీ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి చాలామంది తన గదికి పురుషులు వచ్చేవారని తెలియజేస్తోంది.. తరచూ చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టారని.. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చాలామంది తలుపులు బాదేవారంటూ వివరించింది. ఇలా విసిగించిన వారి నుంచి తప్పించుకోగలిగాను కానీ మరి కొంతమంది చేతిలో తప్పించుకోలేకపోయానని వెల్లడిస్తోంది.
తలుపులు తీయకపోతే ఇక్కడే ఉరేసుకొని చచ్చిపోతామంటూ బెదిరించారని.. ఇలా సినిమాలలో అవకాశాల కోసం కొందరి అవసరాలను కూడా తీర్చాల్సి వచ్చిందంటూ ఇటీవలే జయలలిత ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఒక మలయాళ డైరెక్టర్ అయితే గదిలోకి రాకపోతే సినిమా నుంచి తీసేస్తానని చెప్పారని తాను ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుంచి వైదొలిగించారని తెలిపింది. కేవలం వారంతా శరీర అవసరాల కోసం మాత్రమే నా దగ్గరకు వచ్చారంటూ వెల్లడించింది.ఇప్పటికి తాను 40 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని తెలిపింది. జయలలిత కేవలం సినిమాలలోనే కాకుండా టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నారని ఇక్కడ కూడా తనకు బాగా పాపులారిటీ రావడంతో సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: