టీవీ: అలాంటి భార్య కావాలంటున్న సుడిగాలి సుధీర్..!

Divya
బుల్లితెర కార్యక్రమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్టుగా వ్యవహరించిన సుడిగాలి సుదీర్ ఇప్పుడు సినిమాలలో అవకాశాలు దక్కించుకొని హీరోగా సత్తా చాటుతున్నారు. ఇటీవల గాలోడు సినిమాతో హిట్ టాక్ సొంతం చేసుకున్న సుధీర్ ఇప్పుడు GOAT సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సుదీర్ పలు కామెడీ షోలలో యాంకర్ రష్మితో కలిసి నడిపిన ప్రేమాయణం అంతా ఇంత కాదని చెప్పాలి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం వల్లే నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వినిపించాయి. అయితే ఇప్పటివరకు వీరు ఈ విషయంపై స్పందించలేదు. ఇకపోతే సుధీర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా ఆయన పెళ్లి గురించి అలాగే రష్మితో ప్రేమ గురించి ఎన్నో రకాల ప్రశ్నలు వస్తూనే ఉంటాయి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీర్ ను యాంకర్ ప్రశ్నిస్తూ.. మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటూ ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సుధీర్ సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే.. కనుక మనకు కాబోయే భార్యలో ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఖచ్చితంగా చెప్పగలము. అయితే నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు అంటూ షాక్ ఇచ్చారు. నిజంగా ఎవరికైతే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటుందో అలాంటి వారికి కాబోయే అమ్మాయి చాలా కూల్ గా.. ఎప్పుడు హ్యాపీగా ఉండడం వంటి క్వాలిటీస్ ఉంటే చాలని.. ఇంతకంటే మరేమీ అవసరం లేదని.. సుదీర్ తెలిపారు. ఇకపోతే సుధీర్ తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: