TV: బిగ్ బాస్ లోకి హాట్ యాంకర్.. గ్లామర్ డోస్ మరింత పెంచేలా..?

Divya
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఏడవ సీజన్ కి కూడా సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ షో కి సంబంధించి పలు వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే హోస్ట్ విషయంలో ఎప్పటినుంచో వార్తలు రకరకాలుగా వినిపిస్తున్నా.. ఫైనల్ గా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నట్లు ప్రోమోను కూడా విడుదల చేశారు.
మిగిలింది  కేవలం కంటెస్టెంట్ల లిస్టు మాత్రమే. రోజుకొక కంటెస్టెంట్ పేరు వినిపిస్తూ ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మరింత గ్లామర్ డోస్ పెంచడానికి ప్రముఖ హాట్ యాంకర్ ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు దీపికా పిల్లి. హాట్ యాంకర్ దీపిక పిల్లి సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత యాంకర్ గా మారిపోయింది. విజయవాడ దగ్గరలో పుట్టి పెరిగిన దీపిక పిల్లి మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులారిటీ దక్కించుకుంది అలా సోషల్ మీడియా సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత ఢీ లోకి అడుగుపెట్టి మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అంతేకాదు రష్మీ, సుడిగాలి సుదీర్ ఒక జంట కాగా దీపికా పిల్లి, హైపర్ ఆది మరొక జంటగా ఈ షోలో అందరినీ అలరించారు. ఇక తర్వాత దీపికా పిల్లికి సినిమా ఆఫర్ కూడా రావడంతో ఆమె దశ తిరుగుతుందని అందరూ అనుకున్నారు. అందులో భాగంగానే వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో దీపిక పిల్లి కీలకపాత్రలో నటించి..అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతోంది . నిర్వాహకులు ఆమెను సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం . మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: