పవన్‌ కల్యాణ్‌పై ఎల్లో మీడియా వివక్ష చూపుతోందా?

Chakravarthi Kalyan
మీడియా అనేది ఉన్నది ఉన్నట్టుగా తన, మన బేధం లేకుండా, ఎవరి మీద పక్షపాతం లేకుండా, నిక్కచ్చిగా ప్రవర్తించేలా ఉండగలగాలి. ఒకరికి కొమ్ము కాయకుండా దమ్ము గా ముందుకు వెళ్లాలి. కానీ ఇప్పుడు రాజకీయాల్లో పొజిషన్లో ఉన్న వ్యక్తులు అయితే తాము సొంతగా మీడియా సంస్థలని నడపడమో, లేదంటే మీడియాని అనుకూలంగా మలుచుకోవడమో చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఎవరి ఆధీనంలో వాళ్లకు సంబంధించిన మీడియా వర్గం ఉండేసరికి ఉన్న నిజం పక్కన పెట్టి తాము అనుకున్న ఇజం చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలోని ద్వారంపూడి లోని ఒక సభలో ప్రసంగించారు. అయితే దానికి సంబంధించిన వ్యూయర్ షిప్ జనసేన పార్టీ సొంత యూట్యూబ్ ఛానల్ లో అయితే 50 కే ఉందట. అంటే 50 వేల వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది.

అంటే 50 వేల మంది వరకు ఆ కాకినాడ ద్వారంపూడి ప్రసంగాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ లో చూసినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ లోనే 50 కే వ్యూస్ వస్తే, మరి న్యూస్ ఛానల్స్  అన్నిట్లోనూ ఇదే వైరల్ న్యూస్ అవుతుంది కదా అని చూసిన అభిమానులకు, ప్రజలకు నిరాశ ఎదురయింది. ఎందుకంటే టీవీ9, ఏబీఎన్, టీవీ 5, ఎన్టీవీ ఈ న్యూస్ ఛానల్స్ దేనిలోనూ కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రసారం చేయలేదని తెలుస్తుంది.

ఏబీఎన్ లో అయితే ఈ ప్రసంగం మొదలు పెట్టినప్పుడు కొద్దిసేపు మాత్రమే న్యూస్ లో చూపించి ఆపేసారని తెలుస్తుంది. సాక్షి ఛానల్ లో ఎటూ ప్రసారం చేయరు. మరి దీనికి అంతటికి కారణం ఏమిటంటే మొన్న పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వమని అది కూడా రెండుసార్లు అవకాశం ఇవ్వమని, అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఫోకస్ మార్చిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: