టీవీ: బుల్లితెర హీరోయిన్స్ ఎక్కడి వారో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో వెండితెరపై హీరోయిన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే స్థాయిలో బుల్లితెర హీరోయిన్స్ కూడా పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా వెండితెర హీరోయిన్స్ తో ఇప్పుడు బుల్లితెర హీరోయిన్స్ కూడా పోటీ పడుతూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. చూడడానికి అచ్చు తెలుగు హీరోయిన్స్ లా కనిపించే వీరు ఇతర భాషల నుంచి వచ్చిన నటీమణులే కావడం గమనార్హం. వీరంతా కూడా ఇప్పుడు తెలుగులో తమ హవా చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సీరియల్స్ లో ఎక్కువగా నటిస్తున్నది కన్నడ ముద్దుగుమ్మలే అని చెప్పవచ్చు.
మరి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో మంచి పేరు సంపాదించుకున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
బంగారు పంజరం హీరోయిన్ నిఖిత, జానకి కలగనలేదు హీరోయిన్ ప్రియాంక, అమ్మనా కోడలా హీరోయిన్ నిత్య, కోయిలమ్మ హీరోయిన్ కావ్య శ్రీ, చైత్ర రాయ్,  రామ చక్కని సీత హీరోయిన్ నవ్య వంటి హీరోయిన్లందరూ కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో వివిధ సీరియల్స్ లో నటిస్తూ మంచి ప్రేక్షక ఆదరణ పొందడమే కాదు అంతకుమించి పాపులారిటీ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇక వీరితోపాటు కార్తీకదీపం మౌనిత అలియాస్ శోభా శెట్టి, నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, గుప్పెడంత మనసు హీరోయిన్ రక్షా గౌడ, కస్తూరి ఐశ్వర్య, కల్యాణ వైభోగమే సీరియల్ హీరోయిన్ మేఘన లోకేష్ , బంగారు గాజులు సీరియల్ హీరోయిన్ నక్షత్ర గుండమ్మ కథ హీరోయిన్ పూజ మూర్తి ఇలా వీళ్లంతా కూడా కన్నడ భాష నుంచి వచ్చి తెలుగులో తమ సత్తా చాటుతున్నారు.
అంతేకాదు తెలుగులో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లుగా కూడా చలామణి అవుతూ ఉండడం గమనార్హం. మరొకపక్క కార్తీకదీపం సీరియల్ తో వంటలక్కగా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్ కేరళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. ఇలా వీరంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగులో సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: