బిగ్ బాస్: ప్రైజ్ మనీ చూసి ఆశ్చర్యపోతున్న కంటెస్టెంట్స్..!

Divya
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఆరవ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. రేపటితో 14 వారాలను పూర్తి చేసుకోబోతున్న ఈ సీజన్.. ప్రేక్షకులను ఉత్కంఠ భరితంగా బిగ్బాస్ చూసేలా చేస్తోందని చెప్పవచ్చు . ముఖ్యంగా కంటెస్టెంట్ల చేత రకరకాల టాస్కులు ఇస్తూ వారి చేత ఆట ఆడిస్తూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు రాగా వారిలో 13 వారాలకు గాను 13 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో మిగిలి ఉన్నది ఏడు మంది మాత్రమే వారిలో శ్రీహాన్, రేవంత్, రోహిత్ , ఆదిరెడ్డి, కీర్తి ,ఇనయ, శ్రీ సత్య.

అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ఇనయా, కీర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . నిజానికి శ్రీ సత్య ఓట్ల పరంగా వెనుకంజలో ఉన్నప్పటికీ.. ఆటపరంగా నయం ఆట తీరు తగ్గిందని అందుకే ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఈ ఏడు మందిలో ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారో రేపటి ఎపిసోడ్ ప్రచారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. ఇకపోతే ఇప్పటివరకు టైటిల్ విన్నర్ గా రేవంత్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. కానీ తాజాగా రోహిత్ పేరు కూడా వినిపిస్తోంది . ప్రస్తుతం వీరిద్దరిలో పోటీ ఏర్పడిన నేపథ్యంలో  బిగ్బాస్ టైటిల్ విన్నర్ కి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే ఈ విషయాన్ని తాజాగా హోస్ట్ నాగార్జున రివీల్ చేయడంతో కంటెస్టెంట్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.. బిగ్బాస్ టైటిల్ విన్నర్ కు రూ.47 లక్షల బిగ్ బాస్ ప్రైజ్ మనీ తో పాటు సాకేత్ ప్రణామంలో  సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు రూ. 25 లక్షల విలువైన 60 యార్డ్స్ భూమిని బహుమతిగా అందజేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత ప్రైజ్ మనీ చూసి అటు కంటెస్టెంట్లే కాదు ఇటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: