వైసీపీకి బిగ్ షాక్‌... గుంటూరులో బిగ్ వికెట్ డౌన్‌

RAMAKRISHNA S.S.
ఏపీలో ఎన్నిక‌ల వేళ ప‌లు పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు టిక్కెట్లు రాకో.. లేదా టిక్కెట్లు వ‌చ్చినా తాము కోరుకున్న సీట్లు రాలేద‌నో పార్టీలు మారిపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మాజీ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాంకు సీటు రాలేద‌ని కాదు.. త‌న‌కు న‌చ్చిన సీటు జ‌గ‌న్ ఇవ్వ‌లేద‌ని మ‌రీ పార్టీ మారిపోయారు. జ‌గ‌న్ ఈ సారి ఆయ‌న‌కు ఆలూరు సీటు కాకుండా... క‌ర్నూలు పార్ల‌మెంటు నుంచి పోటీ చేయ‌మ‌ని చెప్పి మ‌రీ టిక్కెట్ ఇచ్చారు.
అయితే జ‌య‌రాంకు క‌ర్నూలు పార్ల‌మెంటుకు పోటీ చేయ‌డం ఇష్టం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారిపోయి తెలుగుదేశం కండువా క‌ప్పేసుకున్నారు. ఈ సారి జిల్లా మారి అనంత‌పురంకు వెళ్లి అక్క‌డ గుంత‌క‌ల్ నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా పోటీ లో ఉన్నారు. ఇలా ఒక‌రేమిటి టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీల‌కు చెందిన కీల‌క నేత‌లు చాలా సింపుల్‌గా పార్టీలు మారిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి పెద్ద షాకే త‌గిలింది.

ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ.. ద‌ళిత వ‌ర్గంలో కీల‌క నేత‌.. మాజీ మంత్రి గా ప‌నిచేసిన డొక్కా మాణిక్య వ‌ర ప్ర‌సాద్ ఈ రోజు వైసీపీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఆయ‌న ప్ర‌త్తిపాడులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అంత‌కు ముందు డొక్కా కాంగ్రెస పార్టీ త‌ర‌పున రెండు సార్లు తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న తాడికొండ సీటు ఆశిస్తే జ‌గ‌న్ ఆయ‌న‌కు ఇవ్వ‌కుండా మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు ఇచ్చారు.

అక్క‌డే ఆయ‌న వైసీపీకి దూర‌మ‌య్యారు. తాజాగా ఆయ‌న వైసీపీకి రాజీనామా చేసేశారు. డొక్కా టీడీపీ వైపు చూస్తార‌న్న ప్ర‌చారం అయితే గుంటూరు జిల్లాలో గ‌ట్టిగా వినిపిస్తోంది. గుంటూరు పార్ల‌మెంటుకు టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తోన్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ద్వారా ఆయ‌న పావులు క‌దుపుతున్న‌ట్టు టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: