టివి: హిట్ -3 సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారిన అనసూయ..!!
హిట్ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేష్ హిట్ -2 సినిమాలో నటించి మరింత విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా ఈ సినిమా మొదటి రోజు రూ. 11 కోట్ల రూపాయలు వసూళ్ల చేయడంతోపాటు రూ.28.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా సమాచారం. దీంతో అడవి శేష్ ఖాతాలో మరొక సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా హీరోనా అని వ్యవహరించారు. డైరెక్టర్గా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
హిట్ -2 సినిమాలో చివరిలో నాని హిట్ -3 సినిమాలో నటించబోతున్నట్లుగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. హిట్ -2 సినిమాల సైకో కిల్లర్ ప్రవర్తించిన తీరుని ప్రేక్షకులకు సైతం ఒళ్ళు గగుర్పొడిచేలా కనిపిస్తూ ఉన్నాయి.. హిట్ -2 సినిమాలలో ఎప్పుడు తప్పులు అమ్మాయిలు మాత్రమే చేస్తారా? అబ్బాయిలు చేయరా? సీరియల్ సైకో కిల్లర్ అబ్బాయిలే ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హిట్ -3 సినిమాలలో అబ్బాయిల్ని చంపే అమ్మాయిగా అనసూయని చూపించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరొకసారి అనసూయ పేరు వైరల్ గా మారుతోంది. దీంతో మరొకసారి హిట్ -3 సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతోందని చెప్పవచ్చు. మరి ప్రేక్షకులు ఇచ్చిన సలహాలతో అనసూయ నటిస్తుందో లేదో చూడాలి మరి.