జనసేనానికి సపోర్ట్ చేస్తున్న పుష్ప రాజ్?

Purushottham Vinay
సినిమా నటులు అందులోనూ పెద్ద పెద్ద స్టార్ హీరోలు చాలా సెన్సిటీవ్‌గా ఉంటారు. తెర‌పై ఏం చేసినా, చెయ్యాల‌నుకొన్నా కూడా ఒక‌టికి వంద సార్లు వారు ఆలోచిస్తారు. ‘ఇలా చేస్తే.. జ‌నంలోకి ఎలాంటి సంకేతాలు అందుతాయో’ అనే సందేహాలు వాళ్ల‌కు చాలా ఎక్కువ‌. అందుకే వాళ్లేం చేసినా కూడా దాని వెనుక ఓ లెక్క ఉంటుంది. అల్లు అర్జున్ ఇప్పుడు గాజు గ్లాసు ప‌ట్టుకోవ‌డం వెనుక కూడా ఓ లెక్క ఉందంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌. ‘పుష్ష 2’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ తాజాగా విడుద‌లైంది. ఆ పాట ఎలా ఉంది? ఆ పాటలో బ‌న్నీ ఎలా డాన్స్ చేశాడు? అనేదానికంటే బ‌న్నీ చేతిలో ఉన్న గాజు గ్లాసు బాగా హైలెట్ అయ్యింది. పాట‌లో ఓ చోట బ‌న్నీ గాజు గ్లాసు ప‌ట్టుకొని ఓ సిగ్నేచ‌ర్ స్టెప్ కూడా వేశాడు. ఆ స్టెప్ బాగా ఆకట్టుకుంది కూడా. ప‌వ‌న్ కళ్యాణ్ జ‌న‌సేన పార్టీ సింబ‌ల్ గాజు గ్లాసు. ఆ సింబ‌ల్ జ‌నంలోకి చేరువ కావాల‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ కళ్యాణ్ త‌న ప్ర‌తీ సినిమాలో కూడా గాజు గ్లాసు వాడుతూ వ‌చ్చాడు. ఈమ‌ధ్య విడుద‌లైన ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ టీజ‌ర్‌లో కూడా గాజు గ్లాస్ గురించిన ఓ డైలాగే ఉంది.


ఇప్పుడు అల్లు అర్జున్ కూడా గాజు గ్లాసుతో ద‌ర్శ‌నం ఇచ్చాడు.మిగిలిన హీరోలు ఎవ‌రు ఇలా చేసినా కూడా పెద్ద‌గా ఇంపాక్ట్ ఉండేది కాదు. కానీ అల్లు అర్జున్ చేసేస‌రికి.. అంద‌రి దృష్టీ దానిపై ప‌డింది. ఎందుకంటే ఆ మ‌ధ్య బ‌న్నీకీ, ప‌వ‌న్‌కి పెద్ద‌గా చిన్న గ్యాప్ వచ్చింది. అంతగా రాపో ఉండేది కాదు. సరైనోడు ఫంక్షన్ లో ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌’ ఇన్సిడెంట్ ఇందుకు కార‌ణం. అయితే ఆ వివాదం సద్దు మణిగాక అవ‌స‌రం అనుకొన్న సంద‌ర్భంలో ఒక‌రినొక‌రు క‌లుసుకొని త‌మ సంఘీభావం వ్య‌క్తం చేసుకొన్నారు. ఇప్పుడు ప‌వ‌న్‌ కళ్యాణ్ కు అలాంటి మోర‌ల్ స‌పోర్ట్ చాలా అవ‌స‌రం. అందుకే అల్లు అర్జున్ చేతిలో కూడా గాజు గ్లాసు క‌నిపించింది. నిజానికి ఇవ‌న్నీ పైకి చిన్న చిన్న విష‌యాల్లాగానే క‌నిపిస్తాయి. కానీ వాటి ప్ర‌భావం మాత్రం జనాలపై చాలా పెద్ద‌దిగా ఉంటుంది. బ‌న్నీ చేతిలో గాజు గ్లాసు.. జ‌న‌సేన‌ పార్టీకి ఆయ‌న ఇచ్చిన మోర‌ల్ స‌పోర్ట్ అనేది ప‌వ‌న్ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట‌. మరి అది కావాలనే పాటలో పెట్టారో యాద్రుచ్చికంగా పెట్టారో క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: