పైనకేమో టమోటా బాక్సులు.. కానీ లోపల చెక్ చేసి పోలీసులే షాక్?

praveen
ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోవడం ద్వారా వచ్చిన మార్పో.. లేకపోతే సినిమాల ప్రభావమో తెలియదు. కానీ నేటి రోజుల్లో ఎంతోమంది కంత్రిగాళ్లు, జగజ్జంత్రీలు అక్రమాలకు పాల్పడటంలో క్రియేటివిటీని చూపిస్తున్నారు. పోలీసుల కళ్ళు గప్పి ఏదో ఒక విధంగా అక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇలా కేటుగాళ్లు క్రియేటివిటీ తో ఆలోచిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 కంత్రిగాళ్ళ క్రియేటివిటీ చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేస్తున్నారు. దీంతో కేటుగాళ్ల నక్కజిత్తులు పారడం లేదు. అయితే ఇటీవలే తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో లిక్కర్ అక్రమ రవాణాకు యత్నించిన నిందితులను సేబ్ పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరుకు చెందిన పూర్ణచంద్రరావు గుంటూరుకు చెందిన రామ్మోహన్రావు తెలంగాణ నుంచి లిక్కర్ తెచ్చి ఆంధ్రలో అమ్మాలని అనుకున్నారు.

 రామ్మోహన్ రావు తన లారీతో స్నేహితుడైన శ్రీనివాసరావును తీసుకుని తెలంగాణకు వెళ్లాడు. అక్కడ భారీ మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసి టమాటా బాక్సులు పెట్టి లోపల కనబడకుండా లిక్కర్ సీసాలు అమర్చాడు.  హైవేలపై చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రూట్ లో కాకుండా రూరల్ ప్రాంతాల నుంచి మధ్యాన్ని తీసుకెళ్ళేందుకు ప్రయత్నించాడు. అయితే పత్తిపాడు సిఐ మాధవికి వీరి గురించి పక్కా సమాచారం వచ్చింది. ఇంకేముంది వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు వద్ద కాపు కాసారు ఖాకీలు. లారీని ఆపి చెక్ చేస్తుంటే టమాటా తీసుకెళ్తున్నామంటూ ఇక కేటుగాళ్లు బుఖారించే ప్రయత్నం చేశారు. కానీ ఆ టమాటా బాక్సులు తీసి చూస్తే ఏకంగా 133 పెట్టెలో 8.2 లక్షల విలువైన లిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దానిని సీజ్ చేశారు. రామ్మోహన్రావు తో పాటు శ్రీనివాసరావులను కూడా అరెస్టు చేశామని.. పూర్ణచంద్రరావు తో పాటు తెలంగాణను నిందితులకు లిక్కర్ అమ్మిన హనుమంతరావును కూడా అరెస్టు చేయబోతున్నామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: