టీవీ: ఇబ్బందులలో సుధీర్.. పెద్ద దెబ్బ తగిలిందా.. ఏం జరిగిందంటే..!!

Divya
బుల్లితెరపై సుడిగాలి సుదీర్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత యాంకర్ గా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలా బుల్లితెర నుంచి వెండితెర పైన అతి తక్కువ సమయంలోనే హీరోగా మారి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి రాకముందు మెజీషియన్ గా కూడా పనిచేశారు. ఆ తర్వాత తన టాలెంట్ తోనే అతి తక్కువ సమయంలో జబర్దస్త్ టీం లీడర్ గా కూడా మారారు. అప్పటినుంచి సుధీర్ కెరియర్ ఒకసారిగా మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. సుధీర్, రష్మీ జంటకు మంచి క్రేజ్ రావడంతో వీరిద్దరీ గురించి ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా వినిపించేది.

సుధీర్ కమెడియన్ గా ఉన్నప్పుడే ఒక హీరోకు ఉండే క్రేజ్ లభించింది అని చెప్పవచ్చు. అలా సుదీర్ బుల్లితెరపై బాగా పాపులర్ కావడంతో వెండితెర పైన కూడా మంచి పేరు తెచ్చుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇకపోతే సుధీర్ హీరోగా నటించిన ఫస్ట్ చిత్రం సాప్ట్ వేర్ సుధీర్ ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నదని చెప్పవచ్చు. ఇక తాజాగా సుధీర్ జబర్దస్త్ మానేసి ఇతర ఛానల్లో ప్రసారమవుతున్న కొన్ని షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా సుధీర్ నటించిన వాంటెడ్ పండుగాడు చిత్రం విడుదలైంది ఈ సినిమాని డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో తెరకెక్కించడం జరిగింది ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందనుకుంటే .. ఈ సినిమా నిరాశనీ మిగిల్చింది.. దీనివల్ల సుధీర్ చాలా నష్టపోయాడని చెప్పవచ్చు. దీంతో సుదీర్ కి సినిమాలలో హీరోగా అవకాశాలు తగ్గిపోతాయనే అనుమానం అభిమానులలో వ్యక్తం అవుతొంది. ప్రస్తుతం సుదీర్ ఖాతాలో గాలోడు సినిమా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ కూడా యూట్యూబ్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా లో సుదీర్ మాస్ హీరోగా నటించినబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం తో సక్సెస్ అయితే సుధీర్ కెరియర్ ఉంటుంది.. లేకపోతే ఇక అంతే అని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: