టీవీ: మల్లెమాలకు గుడ్ బై చెప్పబోతున్న ప్రదీప్... ఏమన్నాడంటే..?

Divya
దేశవ్యాప్తంగా అన్ని భాషలలో డ్యాన్ షో లకు మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. కానీ ఎన్ని డాన్స్ షో లు వచ్చినా కూడా ఎంత పెద్ద స్టార్ హోస్ట్ గా చేసినప్పటికీ కూడా జడ్జిమెంట్ ఇవ్వడంలో తెలుగు ప్రేక్షకులకు ఢీ షో ఎప్పట్నుంచో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది. ఈ ఢీ షో ని ఈటీవీ మరియు మల్లెమాల సంస్థ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్నో సీజన్లు కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

ఈ షోలో జడ్జీలు,  టీం లీడర్లు ఇలా ఎంతో మంది మారుతున్నప్పటికీ మొదటి నుంచి మంచి రేటింగ్ వస్తూనే ఉన్నది. గత సీజన్లో ఉన్న సుడిగాలి సుధీర్, రష్మీ లు తప్పుకోవడంతో ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రేటింగు దక్కించుకున్న ఢీ షో ఇప్పుడు చాలా డల్ గా మారిపోయిందని చెప్పవచ్చు. ఇక రేటింగ్ పరంగా కూడా డల్ గా పడిపోవడం తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా చాలా వరకు తగ్గి పోయిందని చెప్పవచ్చు. ఏం చేయాలో తెలియని సమయంలో దీని పై మరింత ప్రభావం పడే విధంగా యాంకర్ ప్రదీప్ కూడా వెళ్లిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఢీ షో నుండి ప్రదీప్ వెళ్ళిపోతే మిగిలింది ఏమిటంటూ చాలామంది అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు. ఆయన వెళ్లకుండా ఆపాలంటూ పలువురు అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ప్రదీప్ నుండి క్లారిటీ వచ్చింది అనే వార్త వినిపిస్తోంది. తాను డీ షో ని వదిలి వెళ్లడం లేదని అసలు తనకు అలాంటి ఆలోచన ఎప్పుడూ కూడా రాలేదని అయితే ఆయన మాటల్లో ఈ సీజన్ పూర్తి అయ్యే వరకు ఉంటాను అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. కానీ వచ్చే సీజన్ కు మాత్రం తాను ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని తెలియజేసినట్లు గా అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: