టీవీ: అలా రూమర్స్ రావడంతో చాలా బాధపడుతున్న నటి కవిత.. వీడియో వైరల్..!!

Divya
టాలీవుడ్ లో సీనియర్ నటి కవిత మరణించింది అంటూ భారీగా ప్రచారం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ విషయం పై పలు చర్చలు కూడా మొదలయ్యాయి. ఒకపక్క కవిత బంధు మిత్రులు కూడా చాలా కంగారు పడుతూ ఆమెకు కాల్ చేయడం జరిగిందట. దీంతో స్వయంగా నటి కవిత నేరుగా మీడియా ముందుకు వచ్చి అసలు విషయాన్ని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు ఆమె అభిమానులు. నిన్నటి రోజు నుండి పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో అతను మరణించినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె బాధపడుతున్నట్లుగా ఒక వీడియోని తెలియజేసింది.

ఇక కవిత మాట్లాడుతూ.. తన బంధు మిత్రులు, స్నేహితులు అందరూ కలిసి తనకు ఫోన్లు చేసి మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నారట.. అయితే ఏమైంది అని ఆమె ప్రశ్నిస్తే ఒక వీడియోని సెండ్ చేస్తాను చూడండి అంటూ వారు తెలియజేశారు. ఆ వీడియోలో చూస్తే తను మరణించినట్లుగా ఉన్నాయని ఆమె తెలియజేస్తోంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి అసత్య ప్రచారాన్ని చేయవద్దని.. ఇలాంటి విషయాలను ఎవరూ నమ్మవద్దని ఆమె తెలియజేసింది.
ప్రస్తుతం నటి కవిత చెన్నైలో జీటీవీ సీరియల్ షూటింగులో పాల్గొంటున్నానని ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు దయచేసి ఇక ఆపండి అంటూ తను ఇ వీడియో ని షేర్ చేసింది.. అలాంటి వీడియోలను ఇకమీదట డిలీట్ చేస్తే మంచిదని కూడా తెలియజేసింది. లేదంటే తన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియ జేసింది. అయితే గతంలో కూడా మహేష్, చంద్రమోహన్, షకీలా ఇతర నటీ నటులపై కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయని ఇలాంటి వార్తలు చూసి వారు చాలా బాధ పడినట్లు పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక సోషల్ మీడియాలో ఎవరైనా సీనియర్ నటి నటుల ఫోటోలు కనిపిస్తే చాలు ఇలా ప్రచారాలు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: