టీవీ:లక్షలు పోసి ఖరీదైన నెక్లస్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ హిమజ..!!

Divya
బుల్లితర నటి హిమజా గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హిమజా అటు వెండి తెర పైన, బుల్లితెర పైన బాగానే నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించింది. అలా తనకున్న క్రేజ్ తో.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ప్రేక్షకులకు మరింత కాస్తా దగ్గర అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది అని చెప్పవచ్చు. కానీ బిగ్ బాస్ లో మాత్రం టైటిల్ కొట్టలేక నెగిటివ్ కామెంట్స్ తో బయటికి వచ్చింది. తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటుంది ఈ నటి.
అయితే తాజాగా ఈమె గురించి ఒక విషయం బాగా వైరల్ గా మారుతొంది. తన తల్లికి ఒక ఖరీదైన బహుమతిని కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసింది హిమజ. వీడియో ఫస్ట్ టైమ్ తన అమ్మకు ఒక డైమండ్ నెక్లెస్ కొని ఇచ్చినట్లుగా తెలియజేసింది హిమజ. తన తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నానని తెలియజేసింది.కానీ తన తల్లికి నచ్చింది తీసుకుంటే.. బాగుంటుందని ఆమె ఆలోచించి తానే స్వయంగా తన తల్లి ని షాప్ కి తీసుకొని వెళ్ళింది.
ఇక తన అమ్మకు డైమండ్ నెక్లెస్ తీసుకున్న తర్వాత హిమజా కూడా తనకు నచ్చిన నగలు తీసుకున్నది. అలాగే వజ్రాల ఆభరణాలతో పాటుగా, ఒక బంగారు వడ్డాణం, బంగారు నెక్లెస్ సెట్ ను తీసుకున్నది. ప్రస్తుతం ఈ విషయాన్ని తన వీడియో ద్వారా తెలియజేసింది. దాదాపుగా ఇవన్నీ రూ.25 లక్షలు పైగా ఉన్నట్లు గా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు, కొంత మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్య ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: