టీవీ : ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ గా రెబల్ స్టార్ ఫ్యామిలీ..!!

Divya
 బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ నెల 19వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరు అనే విషయం తెలియజేస్తారు. ఇందులో ఎవరు గెలుస్తారనే విషయంపై ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మరొకవైపు బిగ్ బాస్ -5 లో విన్నర్ గా సన్నీ గెలుస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం షణ్ముఖ్ జస్వంత్ రెండవ స్థానంలో గెలవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఇందులో ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ గా ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక వారి గురించి ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్-5 లో శ్రీ రామచంద్ర విన్నర్ కావాలనే ఎంతో మంది కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక వీరితో పాటు సిరి, మానస్సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ వీరందరికి తక్కువగానే సపోర్ట్ , ఓటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి శ్రీరామచంద్రకు మద్దతు ఇవ్వనున్నట్లు గా తెలియజేసింది. ఇక సోనుసూద్ వంటివారు కూడా ఈ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడం గమనార్హం. ఇక ఈ సపోర్టును  ఒక వీడియో ద్వారా తెలియజేసింది.

Your browser does not support HTML5 video.
వీడియో లో మాట్లాడుతూ.. శ్రీ రామచంద్ర కే నా సపోర్టు అని తెలియజేశారు శ్యామల దేవి. ఇక ఆయన పాటలు, తనకు ,తన భర్త కృష్ణంరాజుకు చాలా ఇష్టం అని తెలియజేసింది. ఇక ఈ కంటెస్టెంట్ పాడిన భక్తి పాటలు అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇక శ్రీ రామచంద్ర ఇండియన్ ఐడిల్ లో మొదటి స్థానం గెలవడం వల్ల అందరికీ బాగా తెలుసు అని శ్యామలాదేవి తెలియజేసింది. తను ఎలాగైనా ఈ షోలో విన్నర్ కావాలని కోరుకుంటున్నట్లు గా తన ఫ్యామిలీ సభ్యుల నుంచి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: